టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టు. ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2021లో సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. 2019 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓడి మూడో వన్డే వరల్డ్ కప్ సాధించలేకపోయింది. ఆ మ్యాచ్ తలచకుంటే.. 240 పరుగుల టార్గెట్ చేజ్ చేసే క్రమంలో ఆదిలోనే టపటప వికెట్లు పడిన దృశ్యాలు.. ఆ తర్వాత జడేజా, ధోని విరోచిత పోరాటం.. చివర్లో ధోని రన్ అవుట్ కళ్ల ముందు కదులుతాయి. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ పెవిలియన్‌కు వెళ్తున్న ధోనిని ఎవరూ మర్చిపోలేరు. 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో ధోని రన్ అవుట్ టీమిండియాకు వరల్డ్ కప్ దూరం చేసిందని, ధోని కనుక ఉండిఉంటే కథ వేరేగా ఉండేదని చాలా మంది ఇప్పటికీ బలంగా నమ్ముతారు.
అదే విధంగా డైరెక్ట్ త్రోతో ధోనిని అవుట్ చేసి, ఇండియా ఓటమికి కారణమైన మార్టిన్ గప్టిల్‌ను కూడా ఇండియన్ ఫ్యాన్స్ మర్చిపోరు. ఆ రన్ అవుట్‌కు ముందు, ఆ తర్వాత ఫైనల్‌లో కూడా గప్టిల్ పెద్దగా రాణించలేదు. జట్టుకు భారంగా మారాడు. కానీ ఆ ఒక్క రన్ అవుట్‌తో న్యూజిల్యాండ్‌కు హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్‌లో బుధవారం మధ్యాహ్నం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కివీస్‌ను స్కాట్లాండ్ మొదట్లో బాగానే కట్టడి చేసింది. 16 ఓవర్ల వరకు కివీస్ స్కోర్ 106 పరుగులు మాత్రమే ఉంది. ఈ దశలో చెలరేగిన గప్టిల్ 93 పరగులతో కదంతొక్కి జట్టు స్కోర్‌ను 172కు చేర్చాడు.
ఇదీ చదవండి: క్రికెట్ లో తరచూ వినిపించే పదం నెట్ రన్ రేట్… అంటే?
తక్కువ స్కోర్‌కు కివీస్‌ను కట్టడి చేసి స్కాట్లాండ్ విజయం సాధిస్తే టీమిండియాకు సెమీస్ దారులు తెరుచుకుంటాయని ఇండియన్ ఫ్యాన్స్ భావించారు. కానీ మళ్లీ గప్టిల్ అడ్డుపడి అద్భుత ఇన్నింగ్స్ ఆడి స్కాట్లాండ్ ఎదుట భారీ టార్గెట్ ఉంచాడు. అప్పటికీ పోరాడిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 156 పరుగులు చేసి కేవలం 16 పరుగులతో ఓడిపోయింది. జట్టు మొత్తం విఫలమైనా కూడా గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్‌తోనే ఆ తేడా. ఇక్కడ స్కాట్లాండ్ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత కష్టం కావడానికి కూడా గప్టిల్ కారణంగా నిలిచాడు. అప్పుడు వన్డే వరల్డ్ కప్‌లో ధోనిని రన్‌అవుట్ చేసి, ఇప్పుడు ఫామ్‌లో లేకుండానే 93 పరుగులు పరోక్షంగా టీమిండియాను దెబ్బ కొట్టాడు గప్టిల్.
వాస్తవానికి గప్టిల్ ఈ టీ20 వరల్డ్ కప్‌లో గాని, 2019 వన్డే వరల్డ్ కప్‌లోగాని ఫామ్‌లో లేడు. కానీ అతను ఇచ్చే ఒక చిన్న మంచి ప్రదర్శన మాత్రం ప్రతిసారీ టీమిండియాకు ఎదురుదెబ్బగా మారుతోంది. ఇక ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే అందుకు కారణం గప్టిల్ అయితే మాత్రం మరోసారి ఈ సెంటిమెంట్ వర్క్‌అవుట్ అయినట్లే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి టీమిండియాను మెగా ఈవెంట్లలో దెబ్బ తీస్తున్న మార్టిన్ గప్టిల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MOMENT! A @Martyguptill runout to remove dangerman Dhoni! #INDvNZ #BACKTHEBLACKCAPSpic.twitter.com/ylSdAaDsB3
— BLACKCAPS (@BLACKCAPS) July 10, 2019
More than 3000 T20I runs 🏏
World-class fielder 🤲
And a nice guy as well 😇Yes. #NewZealand opener @Martyguptill is one of the best in the business.#T20WorldCuphttps://t.co/LhIjZcummh
— ICC (@ICC) November 5, 2021