టీ20 వరల్డ్ కప్‌లో పసికూనపై టీమిండియా తన ప్రతాపం చూపించింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములతో వచ్చిన కోపం, కసినంతా ఆఫ్ఘాన్, స్కాట్లాండ్ జట్లపై చూపించింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టమైన దశలో ఉన్న ఒకే ఒక ఆశ కోసం టీమిండియా తనకు కావాల్సిన నెట్ రన్‌రేట్‌ను సాధించింది. శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసి 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక టీమిండియాతో పాటు కోట్లమంది భారత క్రికెట్ అభిమానులు కోరిక ఒక్కటే ఆఫ్గాన్ గెలవాలి. ఆఫ్ఘనిస్తాన్ గెలుపే మనకు సెమీస్ దారి చూపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వేరే దేశం గెలవాలని కోరుకుంటున్నారు.
న్యూజిల్యాండ్‌తో ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ ఆడే మ్యాచ్ ఫలితంపైనే టీమిండియా సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా కీలకమే. ప్రస్తుతం గ్రూప్ 2 పాకిస్తాన్ 4 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ చేరింది. ఇక 6 పాయింట్లతో రెండో స్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ తలా 4 పాయింట్లతో ఉన్నా.. భారత్ +1.619 మెరుగైన రన్‌రేట్‌తో 3వ స్థానంలో ఉంది. ఇక న్యూజిల్యాండ్‌ను ఆఫ్గనిస్తాన్ ఓడిస్తే 6 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన రన్‌రేట్‌తో 2వ స్థానానికి వెళ్తుంది. భారత్ 4వ స్థానంలో నిలుస్తుంది. ఇక అఖరి మ్యాచ్ నమిబియాతో భారత్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. భారత్ గెలుపు నల్లేరుపై నడకే. సో.. ఆఫ‍్ఘనిస్తాన్, న్యూజిల్యాండ్, భారత్ తలా 6 పాయింట్లతో ఉంటారు. అప్పుడు నెట్ రన్‌రేట్ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
ఇప్పటికే గ్రూప్‌లోనే అందరికంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న టీమిండియా నమిబియాతో మ్యాచ్ గెలుపుతో మరింత మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఈ లెక్కలు చెప్పుకోవడానికి బానేఉన్నా.. ఇవన్నీ జరగాలంటే ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేయాలి. బలమైన న్యూజిల్యాండ్‌ను ఓడిస్తే ఆఫ్ఘనిస్తాన్ అభిమానుల కంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సంతోషిస్తారు. అలా కాకుండా న్యూజిల్యాండ్ గెలిస్తే మాత్రం… జడేజా చెప్పినట్లు బ్యాగులు సర్డుకుని ఇంటికి దారి పట్టడమే. మరి ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేసి న్యూజిల్యాండ్‌ను ఓడిస్తుందని మీరు భావిస్తున్నారా? లేకా టీమిండియా ఇంటికి వస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.