టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో జోరును కొనసాగించిన పాకిస్తాన్ జట్టుకు సెమీస్ లో బ్రేక్ పడింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్లు రిజ్వాన్(67), బాబర్ ఆజామ్(39) అద్భుతమైన ప్రారంభాన్నిచ్చి 176 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచారు.
అయితే ఆ తర్వాత బ్యాంటింగ్ దిగిన ఆసీస్ చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉండగా స్టోయినిస్(40), వేడ్(41) సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడి భారీ విజయాన్ని అందించారు. దీంతో లీగ్ దశ నుంచి మంచి విజయాలతో వస్తున్న పాకిస్తాన్ కు రెండో సమీస్ లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటమిపై పాక్ అభిమానులు తట్టుకోవటం లేదు. ఇక ఇందులో భాగంగా ఓ పాకిస్తాన్ బాలుడు ఆస్ట్రేలియా చేతిలో పాక్ ఓడిపోయిందని కన్నీటి పర్యంతమవుతూ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో పక్కనున్న తన తండ్రి ఓదార్చే ప్రయత్నం చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
https://www.facebook.com/SportskeedaCricket/videos/a-young-pakistan-fan-in-tears-after-seeing-his-side-lose-in-the-semis-against-au/247781250668556/