ఈ సారి టీ20 వరల్డ్ కప్ ఎంతో ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే టీమిండియాతో పాటు మిగత జట్లు సెమీస్ ఆశలు చేజారటంతో ఇంటి బాట పట్టాయి. ఇక నవంబర్ 14న ఈ మెగా టోర్నీ ముగియటంతో ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు టైటిల్ రేసులో కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఆరోన్ ఫించ్ సారధ్యంలో ఆసీస్ జట్టు బలంగా ఉందని తెలిపాడు. దీంతో టైటిల్ రేసులో ఉన్నట్ల మిగతా జట్లతో పోలిస్తే ఆసీస్ టైటిల్ గెలిచేందుకు అర్హత సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఆస్ట్రేలియాలోని మార్ష్, స్టొయినిస్, మాక్స్‌వెల్ వంటి కీలకమైన ఆటగాళ్లు నిలకడగా రాణిస్తే ఖచ్చితంగా ఈ టోర్నీలో విజయం సాధింస్తుందని షేన్ వార్న్ తెలిపాడు.