టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎట్టకేలకు తన స్థాయి ప్రదర్శన ఇచ్చింది. టోర్నీ ప్రారంభంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన బౌలింగ్, న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన బ్యాటింగ్ రెండు కూడా ఒకే మ్యాచ్‌లో అదరగొట్టాయి. ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఇచ్చిన గట్టి పునాదిపై 200పై చిలుకు పరుగుల భవనం కట్టేశారు పంత్, పాండ్యా. మొత్తానికి టీమిండియా ఈ వరల్డ్ కప్‌లో వరుస ఓటముల తర్వాత ఊరటనిచ్చే ఒక మంచి విజయాన్ని సాధించింది. బుధవారం గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.
మళ్లీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. రిషభ్ పంత్ (13 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. తర్వాత అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులే చేసి ఓడింది. కరీమ్ జనత్ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ నబీ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేపు జరిగే గ్రూప్–2 మ్యాచ్‌ల్లో నమీబియాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)… స్కాట్లాండ్‌తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. రన్‌రేట్ మరింత మెరుగుపడాలంటే ఈ మ్యాచ్‌లోనూ భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ఇక ఆఫ్ఘనిస్తాన్, న్యూజిల్యాండ్ మధ్య శుక్రవారం మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి. దాంతో లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్, న్యూజిల్యాండ్, ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌లలో గెలిచి రన్‌రేట్ ఆధారంగా ఒక జట్టు పాక్‌తో పాటు సెమీస్ చేరే అవకాశం ఉండి. నమిబియా, స్కాట్‌ల్యాండ్ జట్టు అద్భుతాలు చేయకుంటే ఈ సమీకరణలు ఉంటాయి. పొరపాటున ఈ రెండు జట్లలో ఏ జట్టు అద్భుతం చేసినా లెక్కలన్ని తారుమారు అవుతాయి.
ఓపెనర్లుగా మళ్లీ రోహిత్ శర్మ, కేఎస్ రాహుల్ వచ్చారు. మొదటి మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చిన ఈ జోడి, రెండు మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్‌తో రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. ఆ మార్పు విఫలం కావడంతో మళ్లీ పాత జోడినే దిపింది టీమిండియా. ఈ సారి ఈ జోడి అదరగొట్టింది. ఏకంగా 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో వన్‌డౌన్‌లో రావాల్సిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అనూహ్యంగా రిషభ్ పంత్ బ్యాటింగ్ దిగాడు. కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. అతని స్థానంలో హార్థిక్‌పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. చివర్లో వీళ్లిద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఇండియా రెండు వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ కోహ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదనే ప్రశ్న మాత్రం సగటు భారతీయ క్రికెట్ అభిమానిని తొలచేస్తుంది. మరి టీమిండియా సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s good night from Abu Dhabi after #TeamIndia seal a solid win. 😊 👍#T20WorldCup #INDvAFG pic.twitter.com/hpPYKX0za6
— BCCI (@BCCI) November 3, 2021
Excellent win today in Abu Dhabi to get our first points. It was an all-round show from #TeamIndia #mshami11 pic.twitter.com/zAiOQBbII1
— Mohammad Shami (@MdShami11) November 3, 2021