టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇంత సంక్లిష్టం పరిస్థితి వస్తుందని పాక్ మ్యాచ్‌కు ముందు ఎవరు ఊహించి ఉండరు. పసికూనలతో మ్యాచ్‌లో కూడా లెక్కలు వేసుకుని ఆడాల్సిన పరిస్థితి వచ్చింది బలమైన టీమిండియాకు. సెమీస్‌కు చేరేందుకు రాజమార్గం లేకపోయినా ఇతర జట్ల జయాపజయాలతో చాన్స్ మాత్రం ఉంది. ప్రస్తుతం పాక్, కివీస్ చేతిలో ఓడి ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ తేడాతో గెలిచిన టీమిండియా 2 పాయింట్లతో ఉంది. మన గ్రూప్ నుంచి ఇప్పటికే పాక్ సెమీస్‌కు చేరింది. ఇక ఒక జట్టుకే సెమీస్ వెళ్లే అవకాశం ఉంది. ఈ రేసులో కూడా టీమిండియా న్యూజిల్యాండ్, అఫ్గాన్ జట్ల కంటే వెనుకబడి ఉంది.
ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే న్యూజిల్యాండ్ ఒక మ్యాచ్‌లో ఓడిపోవాలి. అప్పుడు టీమిండియాకు నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఒక వేళ అనుకున్నట్లు కివీస్ జట్టు ఒక మ్యాచ్ ఓడిపోతే రన్‌రేట్ విషయంలో ఆఫ్గనిస్తాన్ జట్టు కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ రన్‌రేట్ ప్లస్ 1.481 ఉండి. టీమిండియా ప్లస్ 0.073తో నాలుగో స్థానంలో ఉన్నాం. ఈ తేడాను అధికమించి అఫ్గాన్ కంటే ముందు ఉండాలంటే నేడు(శుక్రవారం) స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మ్యాచ్ భారత్ ఎంత తేడాతో గెలవాలో తెలుసుకుందాం.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే దాదాపు 110 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించాలి. అలాగే మొదటి బౌలింగ్ చేయాల్సి వస్తే స్కాట్లాండ్‌ను వీలైనంత తక్కువ పరుగులకు కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని కేవలం 7.2 ఓవర్లలోనే ఛేదించాలి.
ఇలా భారీ తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ లెక్కలు కూడా న్యూజిల్యాండ్ అఫ్గాన్ చేతిలో లేదా నమిబియా చేతిలో ఓడితేనే.. న్యూజిల్యాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఏ లెక్కలతో పనిలేకుండా సెమీస్‌కు వెళ్తుంది. కానీ భారత్‌కు ఉన్న ఒకే ఒక్క ఆశ ఆఫ్ఘనిస్తాన్. ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్లదైన రోజున ఏ జట్టునైనా మట్టికరిపించే సత్తా ఆ జట్టుకు ఉంది. ఈ ఒక్క అంశమే టీమిండియాలో సెమీస్ ఆశలకు ఊపిరి పోస్తుంది.
#Scotland will have to take their cricket to a new level 📈#India need a BIG win to keep their #T20WorldCup finals hopes alive.#INDvSCO preview 👇https://t.co/j156wPds3i
— T20 World Cup (@T20WorldCup) November 5, 2021