ప్రపంచ క్రికెట్ లో సంచలనాలు నమోదుచేస్తున్న టీమిండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ను దురదృష్టం వెంటాడింది. ఏడాది కాలంగా మెరుగైన ప్రదర్శన ఇస్తూ అగ్రస్థానం వైపు దూసుకొచ్చిన సూర్య.. ఆ ర్యాంకుకు చేరుకున్నట్లే చేరి మళ్ళీ కిందకు పడిపోయాడు. దీంతో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ మరోసారి అగ్రపీఠంపై కూర్చున్నాడు. మైదానం నలువైపులా అలవోకగా షాట్లు బాదుతూ ‘మిస్టర్ ఇండియా 360‘ గా పేరుతెచ్చుకున్న సూర్య అందుకు తగ్గట్టుగా సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ మధ్యలో టాప్-2 ర్యాంకులోకి ఎగబాకిన సూర్య మూడో టీ20లో రెస్ట్ ఇవ్వడంతో నెం.1 టీ20 బ్యాటర్ అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. అయితే.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచుల్లో సూర్య సెన్సేషనల్ పర్ఫామెన్స్ చూపించాడు. తొలి టీ20లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్య, రెండో టీ20లో 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శనతో ఒక్కసారిగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని అధిరోహించాడు. 854 పాయింట్లతో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ను సమం చేశాడు. అయితే.. అది రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 6 బంతుల్లో 8 పరుగులు చేసిన సూర్య, 18 పాయింట్లు కోల్పోయి రెండో(838) స్థానానికి పడిపోయాడు. దీంతో రిజ్వాన్ మరోసారి అగ్రస్థా నంలో కొనసాగుతున్నాడు.
October third – @surya_14kumar became the third Indian batter to achieve the No.1 ranking in T20Is.
📸: @ICC pic.twitter.com/S5htEy1DYx
— CricTracker (@Cricketracker) October 5, 2022
ఇక టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదలయ్యేవరకు దాయాధి దేశాలకు ఎలాంటి మ్యాచుల్లేవ్. దీంతో అప్పటివరకు ఆ స్థానం రిజ్వాన్ దే. అయితే.. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్.. సూర్యభాయ్ వర్సెస్ మహ్మద్ రిజ్వాన్ గా మారనుంది. కాగా, భారత జట్టు టీ20 వప్రపంచకప్ ఆశలన్నీ సూర్యకుమార్ యాదవ్ రాణించడంపైనే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కొచ్చే సూర్య ఆఖరివరకు క్రీజులో ఉంటే.. జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం. దీంతో బౌలింగ్ లైనప్ వీక్ గా ఉన్నా.. ఎలాగోలా నెట్టుకు రావొచ్చు. అదే.. సూర్య విఫలమైతే భారీ స్కోర్ ఆశించడం అత్యాశే. దీంతో ‘మిస్టర్ 360’ రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
October 5th ICC T20I rankings.. pic.twitter.com/17FV8mtaRR
— Govardhan Reddy (@gova3555) October 6, 2022
MCG getting ready for the T20 World Cup, first will be India vs Pakistan clash. pic.twitter.com/cMeHb29M1c
— Johns. (@CricCrazyJohns) October 6, 2022