క్రికెట్ లో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలను నిర్వహించడం దేశానికి గర్వకారణం. మరి ఇలాంటి టోర్నీలను నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అన్ని ఎగబడుతుంటాయి. మరి అలాంటి అవకాశాన్ని ఏ దేశాలు వదులుకుంటాయి చెప్పండి. ఇక వన్డే వరల్డ్ కప్ ను రెండో సారి నిర్వహించడానికి భారత్ సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ పిడుగులాంటి వార్త ఐసీసీ వెల్లడించింది. ఆ వార్త విన్న భారతీయులకు 2023 వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుందా? లేదా? అనుమానం మెుదలైంది. ఇప్పుడు BCCI తీసుకునే నిర్ణయం మీదే వన్డే వరల్డ్ కప్ వేదిక భారతా? కాదా? అని తేలనుంది. అసలు ఇండియా నుంచి వరల్డ్ కప్ తరలి వెళ్లిపోయేంత కారణాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
2016 టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణలో భాగంగా బీసీసీఐ కు భారత ప్రభుత్వానికి మధ్య పన్నుల సమస్య ఏర్పడింది. అదేంటంటే.. టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణలో భాగంగా BCCI ఇండియా ప్రభుత్వాన్ని పన్ను మినహాయింపు కోరింది. ఈ విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దాంతో బీసీసీఐ విన్నపం మేరకు అప్పుడు ఐసీసీ టాక్స్ ను మినహాయించింది. దాదాపు 21.84 శాతం పన్నులను మినహాయించింది. అంటే సుమారు రూ. 190 కోట్లు అన్నమాట. ఈ నేపథ్యంలోనే 2023 వరల్డ్ కప్ కు సైతం భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మనకు తెలిసిందే.
ఇక BCCI-భారత ప్రభుత్వం మధ్య పన్నుల గొడవ ఇంకా ఎటూ తేలకపోవడంతో ఐసీసీ.. బీసీసీఐను హెచ్చరించింది. వీలైనంత త్వరగా పన్నుల వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచింది. 190 కోట్లు బీసీసీఐ నష్టపోయింది. ఈ లావాదేవీల విషయంపై ఇప్పటికీ ఐసీసీ ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగుతోంది. ఇక భారత ప్రభుత్వం నుంచి పన్నుల మినహాయింపు రాకపోతే అది బీసీసీఐ ఆదాయం నుంచి తొలగించబడుతుందని పేర్కొంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ పన్నుల వివాదానికి ముగింపు పలకాలని సగటు భారతీయ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.