ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో అద్బుత సెంచరీతో సత్తా చాటిన పంత్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే ఇంగ్లండ్‌పై 55 బంతుల్లో 71 పరుగులు చేసిన పాండ్యా 8 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు.
ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన పాండ్యా(4/24) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 70వ స్థానానికి చేరుకున్నాడు. యజ్వేంద్ర చహల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు.
నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా..
గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఇంతకు ముందు రెండో ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలోకి వచ్చాడు. తొలి వన్డేలో 6/19తో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన బుమ్రా నంబర్‌వన్ స్థానం ఆక్రమించినప్పటికి.. ఆఖరి వన్డేకు దూరమవడంతో టాప్-2కి పడిపోయాడు.
ఫామ్‌లో లేకున్నా టాప్ 4లో కోహ్లీ..
ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతని తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 892 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉండగా.. మరో పాక్ బ్యాటర్ ఇమాముల్ హక్ రెండు, సౌతాఫ్రికా క్రికెటర్ వాండర్ డుసెన్ మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు ఉన్నారు. టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
👑 New #1 ODI bowler
📈 Hardik Pandya climbs 13 spots
🔝 Babar Azam continues to lead the packThe latest @MRFWorldwide ICC Men’s Player Rankings ⬇️https://t.co/xJaElScI0y
— ICC (@ICC) July 21, 2022