క్రికెట్.. ఫుట్ బాల్ ఆట తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అంతటి ఆదరణ ఉన్న గేమ్. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు కొన్ని కంపెనీలు మ్యాచ్ లను వీక్షించడానికి సెలవులు ప్రకటించిన సందర్భాలూ లేకపోలేదు. ఇక క్రికెట్ అంటేనే జెంటిల్ మన్ ఆటకు పెట్టింది పేరు. దానికి తగ్గట్లుగానే క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. వాటిని అతిక్రమించిన క్రమంలో నిషేధానికి గురైన ఆటగాళ్లూ ఉన్నారు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, డానిష్ కనేరియా, శ్రీశాంత్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా వారిపై నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు బాల్ టాంపరింగ్ చేయడం వల్ల నిషేధానికి గురైయ్యారు. కానీ వీరిపై జీవితకాల నిషేధం మాత్రం విధించలేదు. మరి అలాంటి జెంటిల్ మెన్ గేమ్ లో నిబంధనలను అతిక్రమిస్తే ఐసీసీ కొరడాఝాలిపించడం ఖాయం. ఈ క్రమంలోనే ఐసీసీ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లఘించిన వారు కౌన్సిల్ చట్టాల ప్రకారం శిక్షలకు గురికావాల్సి వస్తుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC).. ప్రపంచ వ్యాప్తంగా మెగా క్రికెట్ టోర్నీలను నిర్వహిస్తోంది. ఈ కౌన్సిల్ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. అదేంటంటే? ఇక నుంచి బాల్ ని చేతిలోకి తీసుకుని దానికి ఉమ్మి రాయడాన్ని శాశ్వతంగా నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమించిన క్రికెటర్లకు ఐసీసీ చట్టాల ఉల్లంఘన కింద శిక్షను విధించవచ్చని పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఆటగాళ్లు బాల్ షైన్ కావాలని దానిపై ఉమ్మిని రాస్తారు. కోవిడ్ కాలంలో దీనిపై 2 సంవత్సరాలే నిషేధం ఉండగా.. దాన్ని ప్రస్తుతం కౌన్సిల్ జీవితకాలానికి పోడిగించింది. అదీ కాక మరికొన్ని నిబంధనలను ఐసీసీ చీఫ్ ఎక్స్ క్యూటివ్ కమీటి( CEC), గంగూలీ సూచనల మేరకు మరికొన్ని నిబంధనలను తీసుకురానుంది.
ఈ క్రమంలోనే టెస్టుల్లో, వన్డేల్లో బ్యాటర్ అవుటైన రెండు నిమిషాల్లోనే మరో బ్యాటర్ క్రీజ్ లోకి రావాలి. ఇక టీ20ల్లో అయితే 90 సెకన్లలోనే రావాలి. ఇవే కాక మరికొన్ని నిబంధనలను కూడా ఐసీసీ తీసుకొచ్చింది. ఇక బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే కొత్తగా వచ్చే బ్యాటర్ కచ్చితంగా స్ట్రైక్ తీసుకోవాలి. అదీ కాక ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ ని ఇబ్బందికి గురిచేస్తే 5 పరుగులను పెనాల్టీ కింద ఇవ్వనుంది. ఈ నిబంధనలను అతిక్రమించిన ఆటగాళ్లు నిషేధానికి గురికాక తప్పదు అని కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయంపై సగటు క్రీడాభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది ఆటగాళ్లు తమకు తెలియకుండానే బాల్ కు ఉమ్మి రాస్తుంటారు. మరి ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి ఆటగాళ్లు అలవాటు పడాలిగా అని మరికొంత మంది నెటిజన్స్ అంటున్నారు. మరి ఐసీసీ ప్రకటించిన ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U
— ICC (@ICC) September 20, 2022