ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. 1975 లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవగా.. ఈ ఏడాది జరగబోయేది 13 వది కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ కీలక మ్యాచులు ప్రకటించారు. దీని ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్ ఎప్పుడు ? చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ ఎప్పుడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కి సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మెగా ఈవెంట్ కి మరో కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న క్రికెటర్లు మరో నాలుగు నెలలో ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. 4 సంవత్సరాలకొకసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ కి చాలా ప్రేత్యేకత ఉంది. తొలిసారి 1975 లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవగా.. ఈ ఏడాది జరగబోయేది 13 వది కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ కీలక మ్యాచులు ప్రకటించారు. దీని ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్ ఎప్పుడు ? చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ ఎప్పుడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
చివరిసారిగా 2011లో భారత్ వరల్డ్ కప్ కి ఆతిధ్యమిచ్చింది. భారత్ తో పాటుగా.. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా ఆతిధ్యమిచ్చాయి. సొంతగడ్డపై జరిగిన ఈ వరల్డ్ కప్ లో ధోని నాయకత్వలో టీంఇండియా శ్రీలంకపై విజయం సాధించి 28 సంవత్సరాల తర్వాత మరోసారి జగజ్జేతగా నిలిచింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత భారత్ లో వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి అన్ని మ్యాచులు భారత్ లోనే జరగడం గమనార్హం. దీంతో టీంఇండియా ఈ సారి హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. అక్టోబర్ 5 నుండి మొదలయ్యే ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
10 దేశాలతో జరగబోయే ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో భారత ప్రయాణం ఆస్ట్రేలియాతో మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ లో జరగనుంది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 న అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఒక సెమీ ఫైనల్ కి ముంబై వేదిక ఖరారవ్వగా..నవంబర్ 19 న జరిగే గ్రాండ్ ఫైనల్ వేదికగా అహ్మదాబాద్ ఫిక్సయింది. మరి మరోసారి సొంతగడ్డపై టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.