ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమి చవి చూసింది. ముంబై చరిత్రలో ఇన్ని వరుస ఓటములు ఎప్పుడూ లేవు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నా.. కూడా ముంబై అత్యంత కఠిన పరిస్థిలను ఎదుర్కొంటుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టేనా ఈ సారి ఆడేది అనే విధంగా ఉండి ముంబై పరిస్థితి. ముంబై ఇండియన్స్‌కు ఏకంగా ఐదు సార్లు కప్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత జట్టు ప్రదర్శనపై చాలా నిరాశతో ఉన్నట్లు సమాచారం.
విండీస్ మాజీ క్రికెట్ ఇయాన్ బిషప్.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత.. రోహిత్‌శర్మ మాట్లాడినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో అతను వరుస ఓటముతో కుంగిపోయి ఉన్నట్లు తనకు అర్థం అయిందని బిషప్ పేర్కొన్నాడు. జట్టు చెత్త ప్రదర్శనకు తోడు.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా కూడా చాలా దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో రోహిత్ మరింత ఒత్తిడికి గురవుతున్నాడు. అతనికి తోడు రిటేన్ చేసుకున్న పొలార్డ్ కూడా పూర్‌ఫామ్‌లో ఉన్నాడు. రూ.15.25 కోట్ల భారీ ధర పెట్టి కొన్న ఇషాన్ కిషన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదనిపించి తర్వాత నుంచి వరుసగా 6 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఇలాంటి పరిస్థితిల్లో జట్టును నడిపించే కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్రోకెన్‌మ్యాన్ కనిపించడం ముంబైకు మరింత కష్టాలు తెచ్చిపెట్టనున్నాయి. పైగా.. ఈ రోజు రోహిత్‌శర్మ పుట్టిన రోజు అయినా కూడా రోహిత్ వేడుకలకు దూరంగా ఉన్నాడంటేనే అర్థం అవుతోంది అతను ఎంత నిరాశలో ఉన్నాడో. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Quinton De Kock: గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిన డికాక్! సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
Mumbai Indians will look to register their first win of the ongoing season when they take the field against Rajasthan Royals on Saturday#IPL2022 #RohitSharma #MumbaiIndians https://t.co/KsvcV8ZhbP
— CricketNDTV (@CricketNDTV) April 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.