ఆసియా కప్ 2022 ఫైనల్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. సూపర్ ఫోర్‌లో నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఆ తర్వాత అంచనాలకు మించి రాణిస్తోంది. వరుసగా నాలుగు విజయాలతో ఫైనల్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా చేతిలో ఓడినా.. సూపర్ ఫోర్‌లో భారత్, ఆఫ్ఘాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. కానీ.. ఫైనల్‌కు ముందు శ్రీలంక చేతిలో మట్టికరిచింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. తానే పాకిస్థాన్ టీమ్‌కు కెప్టెన్ అని బాబర్ అజమ్ ఫీల్డ్ అంపైర్‌కు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే..
శ్రీలంక బ్యాటింగ్ సమయంలో హసన్ అలీ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి బౌన్సర్‌గా వేశాడు. ఆ బంతిని డసన్ షకన కట్ షాడే ప్రయత్నంలో విఫలం అయ్యాడు. బంతి వెళ్లి కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తాకిందని రిజ్వాన్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇస్తాడు. వెంటనే రిజ్వాన్ రివ్యూ కోరడంతో ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరీ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగల్లేదని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాకిస్థాన్ రివ్యూ వేస్ట్ అయింది. ఇక్కడే బాబర్ అజమ్‌కు కాలింది. పాకిస్థాన్ కెప్టెన్ తానని.. నేను చెప్తే కదా రివ్యూ తీసుకోవాల్సిందని అంపైర్‌పై బాబర్ అసహనం వ్యక్తం చేస్తాడు.
బాబర్ అజమ్ తన ఫీల్డింగ్ స్థానం నుంచి ‘కప్తాన్ మై హో..’ అంటూ చెప్పుకుంటూ వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆసియా కప్‌లో కెప్టెన్ బాబర్ కంటే రిజ్వాన్ ఎక్కువగా ఫీల్డ్ మార్పులో, రివ్యూ తీసుకోవడంలో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. దీంతో అంపైర్ సైతం పొరపడి రిజ్వాన్ రివ్యూ కొరిన వెంటనే థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. కాగా.. బాబర్ తాను కెప్టెన్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చినందుకు నెటిజన్లు బాబర్‌పై జాలి చూపిస్తున్నారు. ఇలాంటి కష్టం మరెవరికీ రావద్దంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిరిగి ఈ రెండు టీమ్స్ మధ్యే ఆదివారం ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి బాబర్ అజమ్‌కు ఎదురైన పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ధోని.. ఇందుకే కదా నిన్ను అందరూ ద్వేషించేది! కాస్త మారవయ్యా!
— cricket fan (@cricketfanvideo) September 9, 2022