ధోనీ సారథ్యంలో భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్(2007)ను ముద్ధాడిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ పోరులో పాకిస్తాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి టీ20 ప్రపంచ కప్ ను ముద్ధాడిన ఘనత భారత జట్టుకు దక్కితే, సాధించి పెట్టిన ఘనత ధోనీకి దక్కింది. ఇదిలా ఉంచితే.. టీ20 ప్రపంచ కప్ ముంగిట టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్‌తో యమా బిజీగా గడిపేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రాంచీలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ధోని.. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పి అందరినీ నవ్వించాడు.
ఇటీవల ఓరియో బ్రాండ్ ప్రమోషన్ లో ధోనీ చేసిన రచ్చ అందరకి గుర్తుండే ఉంటుంది. ‘2011లో ఓరియో ఇండియాలో లాంఛ్ అయ్యింది, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది.. ఈసారి మళ్లీ ఓరియా రీలాంఛ్ అవుతోంది.. ఈసారి కూడా ఇండియా వరల్డ్ కప్ 2022 గెలుస్తుంది..’ అంటూ బ్రాండ్ ప్రమోషన్‌ని ఓ పెద్ద సంచలన ప్రకటనలా పదే పదే చెప్పాడు. దీంతో ట్రోలర్స్ ధోనీపై మీమ్స్ సృష్టిస్తూ పండగ చేసుకున్నారు. తాజాగా, ధోని.. మరోసారి అలాంటి వాతావరణాన్నే సృష్టించాడు. రాంచీలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ధోని.. స్థానిక విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు అదిరిపోయే రీతిలో సమాధానం ఇచ్చాడు.
MS Dhoni & Reporter never Ending love Story 😂😂 pic.twitter.com/r9zUSRz8Yu
— DIPTI MSDIAN (@Diptiranjan_7) September 25, 2022
క్రికెట్‌కి సంబంధించిన ప్రశ్న అడిగాలని భావించిన ఓ మీడియా ప్రతినిధి..”మాహీ భాయ్.. వరల్డ్ కప్ దగ్గర్లో ఉంది. క్రికెట్ గురించి ప్రశ్న అడగకపోతే అస్సలు బాగోదు..” అని ప్రశ్నించబోయాడు. వెంటనే ధోని.. “సారీ.. నేను ఈసారి వరల్డ్ కప్ ఆడడం లేదు.. టీం ఇప్పటికే ఆస్ట్రేలియాకి వెళ్లిపోయింది..” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఆన్సర్ తో సదరు మీడియా ప్రతినిధి నవ్వి ఊరుకోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, భారత జట్టు ఆదివారం(అక్టోబర్ 23)న మెల్ బోర్న్ వేదికగా పాక్ తో తలపడనుంది.
“Iam not playing the world cup”. – MS Dhoni in recent interview !! 🥺#MSDhoni © : @mahakshi4710 pic.twitter.com/3O2ZGtxVbZ
— Nithish MSDian 🦁 (@thebrainofmsd) October 20, 2022