టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్ జట్టు తరఫున ఆడునున్నాడు ఓ హైదరాబాదీ. అతని పేరు శ్రీమంతుల సందీప్ గౌడ్. టీమిండియాకు ఆడాలని కలలు కన్న సందీప్ మన తెలుగు వాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లిన సందీప్ అక్కడే స్థిరపడి దేశవాళీ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు ఏకంగా టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్నాడు. సందీప్ 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
వీవీఎస్ లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2009–10 సీజన్‌లో అండర్–22 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ నెగ్గిన హైదరాబాద్ జట్టులో సందీప్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. భారత్‌లో రంజీల్లో అవకాశం కోసం 2013 నుంచి ట్రై చేసినా అవకాశం రాకపోవడంతో 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్ కంపెనీలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు.