ఆస్ట్రేలియాను తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడించిన భారత్.. మూడో టెస్టులో చతికిల పడింది. ఊహించని విధంగా మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరీ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
భారత్‌పై మూడో టెస్టులో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా అధికారికంగా డబ్ల్యూటీసీ(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) 2023 ఫైనల్‌కు క్వాలిఫై అయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా గెలవడంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. తొలి రెండు టెస్టుల్లో భారత్ గెలిచిన తీరు చూస్తే.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియాకు ఓటమి తప్పేలా లేదనిపించింది. ఆస్ట్రేలియా కనీసం చివరి రెండు టెస్టుల్లో ఓడితే.. శ్రీలంకపై ఆధారపడాల్సి వచ్చేంది. కనీసం రెండు టెస్టులను డ్రా చేసుకుంటేనే ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉండేది. కానీ.. మూడో టెస్టులో ఎవరూ ఊహించని విధంగా విజృంభించిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో విజయం సాధించడంతో సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని ఎన్ని విమర్శలు వస్తున్నా స్పిన్ పిచ్‌లను తయారు చేయించుకుని మరీ బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలు నమోదు చేసిన భారత్.. మూడో టెస్టులో అదే స్పిన్‌కు బుక్కైంది. బ్యాటింగ్ వైఫల్యంతో మూడో టెస్టులో ఓడిపోవడంతో.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే ఉన్న ఏకైక మార్గం.. అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న చివరిదైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై కచ్చితంగా గెలిచి తీరాలి. అలా అయితేనే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు వెళ్తుంది. డ్రా చేసుకుంటే.. వేరే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి రావచ్చు. అదంతా ఎందుకనుకుంటే.. నాలుగో టెస్టులో ఆసీస్ చిత్తు చేసి.. మళ్లీ ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతోనే తలపడొచ్చు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బుధవారం ప్రారంభమైన మూడో టెస్టు, తొలి రెండు టెస్టుల్లానే మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ లైనప్ మొత్తం దారుణంగా విఫలం అవ్వడంతో తక్కువ స్కోర్‌కే భారత్ ప్యాకప్ చెప్పేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి, 88 పరుగుల లీడ్ సాధించింది. ఈ 88 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. అదే ఆటతీరుతో రెండో ఇన్నింగ్స్‌లోనూ 163కే ఆలౌట్ కావడంతో.. ఆస్ట్రేలియా ముందు కేవలం 76 పరుగుల టార్గెట్ మాత్రమే నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మూడో రోజు ఉదయం కొద్ది సేపట్లోనే పూర్తి చేసింది. ఒక వికెట్ నష్టానికి 78 రన్స్ చేసి.. 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనతో పాటు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WTC23 Final bound 🏆
Congratulations Australia. See you in June! 👋 pic.twitter.com/H2YdaWPzYV
— ICC (@ICC) March 3, 2023