క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్, ఫీల్డర్ పక్షిలాగా గాల్లో తేలుతూ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆ క్యాచ్‌కు క్రికెట్ లోకం ఫిదా అవుతోంది. మార్ష్‌కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారింది.
న్యూ సౌత్ వేల్స్ ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన డిఆర్సీ షార్ట్ బౌలింగ్‌లో.. హెన్రిక్స్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ ఖాయమని అంతా భావించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కార్ట్‌రైట్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కార్ట్‌రైట్ తన స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో మంచి ఊపు మీద ఉన్న హెన్రిక్స్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక హెన్రిక్స్ ఔటయ్యక న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఏమరుపాటుగా నడుస్తూ నీళ్లలో పడిపోయిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్
Catch of the summer?!
Hilton goes horizontal! #MarshCup pic.twitter.com/uLQcYsXPnn
— cricket.com.au (@cricketcomau) March 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.