ప్రపంచ క్రికెట్ లో ఇండియా అంటే ఇప్పుడు ఒక పవర్. కేవలం ఆట పరంగానే కాదు.., సంపాదన పరంగా కూడా బీసీసీఐ ఒక శక్తిగా ఎదిగింది. ఆటగాళ్లు కలలో కూడా ఊహించనంత డబ్బు వారిపై కుమ్మరిస్తోంది ఇండియన్ క్రికెట్ బోర్డు. అలాంటి బీసీసీఐపై ఓ స్టార్ ఆటగాడు ఇప్పుడు సంచలన కామెంట్స్ చేశాడు. బీసీసీఐ తనని బెదిరిస్తోంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా? దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షలే గిబ్స్. గిబ్స్ కి బీసీసీఐకి సంబంధం ఏమిటి? బీసీసీఐ గిబ్స్ ని ఎందుకు బెదిరిస్తోంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే నెల ఆగస్టు 6 నుంచి పాకిస్థాన్ లో కశ్మీర్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. ఇందులో వెటరన్ క్రికెటర్స్ ఎక్కువగా పాల్గొనబోతున్నారు. అయితే.., బీసీసీఐ దీన్ని వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ లో జరిగే లీగ్ కి.. కశ్మీర్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టడమే ఇందుకు కారణం. దీంతో.., ఈ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లపై బీసీసీఐ ఇండియాలో నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఇదే విషయాన్ని గిబ్స్ కి సైతం తెలియచేసింది. కానీ.., గిబ్స్ మాత్రం ఈ విషయంలో విచిత్రంగా స్పందించాడు.
“బీసీసీఐ తనపై బెదిరింపులకు పాల్పడిదంటూ ట్విటర్ వేదికగా ఆరోపించాడు. పాకిస్తాన్‌లో జరగబోయే కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి వీలేదని.. ఒకవేళ ఆడితే మాత్రం భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని హెచ్చరికలు జారీ చేసిందంటూ తెలిపాడు”. కానీ.., ఇందులో బెదిరింపు ఎక్కడ ఉంది? ఆ లీగ్ ఆడితే.. తమతో సంబంధం తెంచుకున్నట్టే అని బీసీసీఐ ఒక రూల్ పెట్టింది. దీన్ని బట్టి వివిధ దేశాల ఆటగాళ్లు కశ్మీర్ ప్రీమియర్ లీగ్ ఆడాలా? లేదా? అన్నది వారి ఇష్టం. బీసీసీఐ ఇక్కడ ఎవ్వరిని బలవంతం పెట్టి ఆపడం లేదు కదా? మరి.. గిబ్స్ ఎందుకు ఇలాంటి ట్వీట్ చేశాడన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి కొంత మంది అయితే ఈ మాజీ ఆటగాడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.