ప్రపంచ క్రికెట్ చరిత్రలో మునుపెన్నడు జరగని విధంగా.. టీ20 మ్యాచ్‌లో ఒక టీమ్ కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. 140 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేవలం 5.5 ఓవర్లలోనే 15 పరుగులు చేసి జట్టు మొత్తం కుప్పకూలింది. ఈ సంచలన మ్యాచ్.. ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్‌లో జరగడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న లీగ్‌గా బిగ్‌బాష్‌కు పేరుంది. ఆస్ట్రేలియాలో జరిగుతున్న ఈ లీగ్‌లో శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్ – సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రిస్ లీగ్ 36, కోలిన్ డీ 33 పరుగులతో రాణించారు. అయితే.. 140 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్‌ను అడిలైడ్ బౌలర్లు వణికించారు.
హెన్రీ థోర్న్‌టన్, వెస్ అగర్, మాట్ షార్ట్ ధాటికి సిడ్నీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వచ్చిన వారు వచ్చినట్లే.. డకౌట్‌కు వెళ్లారు. తర్వాతి వచ్చే బ్యాటర్‌కు ప్యాడ్లు కట్టుకునేంత టైమ్ కూడా సిడ్నీ బ్యాటర్లు ఇవ్వలేదు. అలెక్స్ హెల్స్ 0, మ్యాథ్యూ గిల్‌కిస్ 0, రిలీ రోసోవ్ 3, జాసన్ సంఘా 0, అలెక్స్ రోస్ 2, డానియల్ సామ్స్ 1, ఓలివర్ డావిస్ 1, క్రిస్ గ్రీన్ 0, గురిందర్ సంధు 0, బ్రెండన్ డాగెట్ 4 ఇలా వరుసపట్టి పెవిలియన్ చేరారు. 11వ బ్యాటర్ ఫారూఖీ ఒక రన్‌తో నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీ బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లు కావడం విశేషం. అయితే.. అడిలైడ్ బౌలర్లలో హెన్రీ థోర్న్‌టన్ 2.5 ఓవర్లలో కేవలం 3 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అగర్ 2 ఓవర్లు వేసి 6 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఓవర్ వేసిన షార్ట్ 5 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో సిడ్నీ థండర్ 15 పరుగులకే ఆలౌట్.. అత్యంత చెత్తరికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Henry Thornton & Wes Agar took nine wickets for just nine runs.#BBL12 pic.twitter.com/SQnjv5uA31
— CricTracker (@Cricketracker) December 16, 2022