క్రికెట్‌కు జింబాబ్వే దేశం అందించిన గొప్ప ప్లేయర్లలో హీత్ స్ట్రీక్ ఒకడు. ఆయన తన కెప్టెన్సీ స్కిల్స్‌తో, ఆల్‌రౌండర్ ఎబిలిటీస్‌తో ఎంతో మందికి ఆరాధ్య క్రికెటర్ అయ్యాడు.
జింబాబ్వే జట్టును ఇప్పుడు అందరూ పసికూనగా చూస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆ టీమ్ పెద్ద జట్లకు చెమటలు పట్టించింది. ఆ సమయంలో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరు హీత్ స్ట్రీక్. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన ఆయన.. ఆటగాడిగానూ తన ప్రతిభతో అందరి మనసులు గెలుచుకున్నాడు. అలాంటి హీత్ స్ట్రీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. హీత్ స్ట్రీక్ హెల్త్ కండీషన్‌పై జింబాబ్వే మాజీ క్రీడల శాఖా మంత్రి డేవిడ్ కోల్టార్ట్ కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. స్ట్రీక్ త్వరగా కోలుకుని రావాలని దేశ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
జింబాబ్వే క్రికెట్‌కు స్వర్ణయుగంగా చెప్పుకునే 90వ దశకంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు హీత్ స్ట్రీక్. 1993లో జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 65 టెస్టులు ఆడిన హీత్ స్ట్రీక్.. సుదీర్ఘ ఫార్మాట్లో 216 వికెట్లు తీయడంతో పాటు 11 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు హీత్ స్ట్రీక్. కెరీర్ మొత్తంలో 189 వన్డేలు ఆడిన ఆయన.. 239 వికెట్లు తీయడంతో పాటు 13 హాప్ సెంచరీలు చేశాడు. అతడు తన లాస్ట్ మ్యాచ్‌ను 2005లో ఆడాడు. 21 టెస్టుల్లో, 68 వన్డేల్లో హీత్ స్ట్రీక్ జింబాబ్వేకు సారథ్యం వహించాడు. మంచి కెప్టెన్‌గా, గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2021లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఎనిమిది సంవత్సరాలు పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు.
Our prayers are with Heath Streak and his family.
Wishing him a speedy recovery🙏🏽#HeathStreak #Zimbabwe #CricTracker pic.twitter.com/F1F5qHfWPi
— CricTracker (@Cricketracker) May 13, 2023