ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మెున్న ఆస్ట్రేలియాతో సిరీస్ ను గెలుచుకన్న భారత్.. తాజాగా సౌతాఫ్రికాను కంగుతినిపించింది. ఈ క్రమంలోనే టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై, ఫామ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రీడాకారులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వరుసలోకి చేరాడు మరో ఆటగాడు.. అతడే వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ. రోహిత్ కెప్టెన్సీలో భారత్ అద్బుతంగా ఆడుతుందంటూ.. పేర్కొన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో రోహిత్ గురించి పలు ఆసక్తికర విషయాలు వివరించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డారెన్ సమీ.. వెస్టిండీస్ కు రెండు టీ20 ప్రపంచ కప్ లను అందించిన దిగ్గజ ఆటగాడు. ఇక తన రిటైర్మెంట్ తర్వాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో ప్రారంభం అయ్యే టీ20 ప్రపంచ కప్ గురించి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డారెన్ సమీ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ..”రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. అతడి సారథ్యంలోనే IPLలో ముంబాయి ఇండియన్స్ అద్భుతంగా రాణిస్తోంది. అదీ కాక అతడికి ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. రోహిత్ శర్మకు స్వార్థం ఉండదు. అతడు ముందు జట్టుకు ప్రాధాన్యం ఇస్తాడు.. ఆ తర్వాతే అతడు అంటూ.. ప్రశంసించాడు.
సారథి అన్నాక ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూండాలి.. దాంట్లో రోహిత్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారత్ తన ఆటను అప్డేట్ చేసుకుంది. మన ఫోన్ లో యాప్స్ ను ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా అన్నమాట. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ.. వారి ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అనుసరిస్తున్న వ్యూహాం ఇదే” అని సమీ అభిప్రాయపడ్డాడు. ఇక అందరు బ్యాటర్స్ గేమ్స్ గెలిపిస్తారు అంటే.. బౌలర్ గా నేను మాత్రం బౌలర్లే మ్యాచ్ ను గెలిపిస్తారు అని చెప్తా అని అన్నాడు. ప్రస్తుతం క్రికెట్ లో భారత్ గొప్పగా రాణిస్తోందని.. కానీ టీ20 జరిగేది ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్ లపై అది గుర్తు పెట్టుకోవాలంటూనే.. చివర్లో టీమిండియాకు సపోర్ట్ చేస్తున్నట్టు హిందిలో చెప్పి నవ్వులు పూయించాడు.
West Indies’ two-time T20 World Cup-winning captain Daren Sammy heaped praises on Rohit Sharma.#INDvSA #RohitSharmahttps://t.co/sGcUw5sdpy
— CricTracker (@Cricketracker) October 4, 2022