ఏ పని మొదలుపెట్టినా సెంటిమెంట్‌ను ఫాలో అవ్వడం ఇప్పుడు కామన్‌గా మారింది. సాధారణ ప్రజలతోపాటు సినిమా స్టార్లు, రాజకీయ నేతలు, క్రీడా ప్రముఖులు.. ఇలా చాలా మంది సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. సినిమాల విషయానికొస్తే.. ఓ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించే ముందు, ముగింపు సమయంలో, అలాగే రిలీజ్ డేట్ విషయంలోనూ ముహూర్తాలను అనుసరిస్తుంటారు. దాదాపుగా అన్ని సినిమాలు శుక్రవారమే విడుదలవుతాయి. ఆ వారం తప్ప మిగిలిన రోజు కొత్త చిత్రాలు పెద్దగా రిలీజవ్వవు. వీకెండ్ హాలీడే కలిసొస్తుందనే విషయాన్ని పక్కనబెడితే.. ఎక్కువ సినిమాలు అదే రోజున విడుదలవ్వడం, సక్సెస్ అవ్వడంతో ఫ్రైడే.. బాక్సాఫీస్ డేగా మారింది.
రాజకీయ రంగంలోనూ సెంటిమెంట్లను పాటించడం పరిపాటిగా మారింది. నామినేషన్ వేసే సమయంతోపాటు పదవీ బాధ్యతలు తీసుకునేంత వరకు నేతలు ప్రతి విషయంలోనూ ముహూర్తాలను, కొన్ని నమ్మకాలను పాటిస్తుంటారు. క్రికెట్‌లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడో వార్త హల్‌చల్ చేస్తోంది. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అందరు బ్యాట్స్‌మెన్ పేర్లలో ‘A’ అనే ఆంగ్ల అక్షరం కామన్‌గా ఉండటంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ద్విశతక వీరులైన రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్.. ఇలా ఈ లిస్టులో ఉన్న 8 మంది క్రికెటర్ల పేర్లలో ‘A’ లెటర్ కామన్‌గా ఉంది. దీంతో ఈ లిస్టును నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో మంగళవారం ఉప్పల్‌లో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. 149 బాల్స్ లో 208 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అతడు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ల లిస్టులో కామన్‌గా ఉన్న విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తద్వారా క్రికెట్‌లోనూ సెంటిమెంట్స్ కామన్ అంటూ నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఓవెల్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన ‘A’ చాలా పేర్లలో కామన్‌గానే ఉంటుంది. కానీ.. ఇప్పుడు దాన్ని సెంటిమెంట్‌గా మార్చేసి.. క్రికెట్ లవర్స్ కొత్త సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shubman Gill joins an elite group of players 🙌
More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE
— ICC (@ICC) January 19, 2023