షమీ వ్యక్తిగత జీవితంలో మరో కుదుపు. అతని భార్య హసీనా జహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా బీసీసీఐ హోటల్లో షమీ కాల్ గాళ్స్ తో గడిపాడని చెప్పుకొచ్చింది.
టీంఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ క్రికెట్ కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందో మనందరికి తెలిసిన విషయమే. అయినా షమీ జీవితం గత నాలుగు సంవత్సరాలుగా గందరగోళంగానే ఉంది. అదేంటి షమీ ప్రతి మ్యాచులో మంచి ప్రదర్శన చేస్తున్నాడుగా అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. జీవితం అంటే కెరీర్ లో మాత్రమే రాణిస్తే సరిపోదు ఫ్యామిలీ పరంగా కూడా సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. షమీ జీవితంలో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం షమీ వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనేది వాస్తవం. నిన్నటి వరకు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేస్తూ హైలెట్ గా నిలిచినా ఈ ఫాస్ట్ బౌలర్.. తాజాగా తన భార్య హసీనా జహాన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
షమీ వ్యక్తిగత కెరీర్ చూసుకుంటే 2014 లో హసీనా జహాన్ తో పెళ్లి అయింది. వీరికి ఒక పాప. అయితే అంతా సజావుగా సాగుతున్న షమీ జీవితం అనూహ్యంగా 2019 లో అనుకోని మలుపు తిరిగింది. అతని భార్య షమీ తీవ్రంగా వేదిస్తున్నాడని, అతనికి వేరే స్త్రీలతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. ఇందుకు గాను షమీ మీద గృహ హింస చట్టం కింద కేసు పెట్టి కూడా పెట్టింది. దీంతో షమీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అవ్వగా.. తన భార్య చేసిన ఆరోపణలన్నీ ఖండిస్తూ వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో సెషన్స్ కోర్ట్ స్టే విధించడంతో భార్య జహాన్ కలకత్తా హై కోర్ట్ ని సంప్రదించింది. అప్పటినుంచి మూడేళ్ళుగా నడిచిన ఈ కేసుపై జనవరిలో కల కత్తా హై కోర్ట్ తీర్పునిచ్చింది.
ఇందుకు గాను షమీ నెలకు 1.30 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించింది. వీటిలో 80 వేలు పిల్లల సంరక్షణ కోసం, 50 వేలు భార్య కోసం అని చెప్పింది. అయితే దీనిపై అసంతృప్తిగా ఉన్న షమీ భార్య తనకు నెలకు 10 లక్షల భరణం కావాలనై డిమాండ్ చేసింది. అంతే కాదు షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించారని, దాని ఎత్తేయాలంటూ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించింది. కట్నం విషయంలో షమీ నన్ను చాల వేధించాడని, టీమిండియా టూర్లకు వెళ్ళినప్పుడు చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తాజాగా షమీపై మరోసారి సంచలన ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. మరి ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం ఐపీఎల్ లో షమీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి సమస్యకి పరిష్కారం దొరుకుందో లేదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.