దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్, ఓపెనర్ హసీమ్ ఆమ్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఆపై సుదీర్ఘ కాలం కౌంటీ క్రికెట్ ఆడిన ఆమ్లా, నేటితో క్రికెట్ తో తన అనుబంధాన్ని తెంచుకున్నాడు. కోచ్ గా, కామెంటేటర్ గా మరోసారి క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వచ్చేమో కానీ, బ్యాట్ పట్టకపోవచ్చేమో అని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో హసీమ్ ఆమ్లాది ప్రత్యేక స్థానం. ఆమ్లా వికెట్ తీయడానికి బౌలర్లు ఎన్నో ఎత్తుగడలు వేసేవారు. ఇండియన్ క్రికెట్ కు రాహుల్ ద్రావిడ్ ఎలాగో.. సఫారీ జట్టుకు ఆమ్లా అలా అడ్డుగోడలా నిలబడేవాడు. సిక్సర్లతో హోరెత్తించకపోయినా, ప్రతి బంతికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ ను పరుగులు పెట్టించేవాడు. ఆమ్లా దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్న హషీం ఆమ్లా.. ఎంతో మంది మంచి స్నేహితులను కూడా సంపాదించుకున్నాడు.
A true great of the game. 🤩
Happy retirement, Hashim Amla! pic.twitter.com/lmE4hJyHdt
— Test Match Special (@bbctms) January 18, 2023
సఫారీ జట్టులో గత 15 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ఈ 39 ఏళ్ల ఓపెనర్.. 2004లో భారత్ తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌తో దక్షిణాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆపై అనతికాలంలోనే జట్టులో నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టీ20ల రాకతో క్రికెటర్లు సరికొత్త షాట్లతో ప్రయోగాలు చేసినా.. సంప్రదాయ క్రికెట్ షాట్లకి సుదీర్ఘకాలంగా హసీమ్ ఆమ్లా ఊపిరి పోస్తూ వచ్చాడు. కెరీర్‌లో 124 టెస్టులు ఆడిన ఆమ్లా.. 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 311. ఇక 181 వన్డేలలో 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఇక 44 టీ20లలో 8 అర్ధశతకాలతో 1277 పరుగులు చేశాడు.
Happy Retirement. Hashim Amla. ♥️ pic.twitter.com/djgI8BaBNH
— RVCJ Media (@RVCJ_FB) January 18, 2023
ఇక కౌంటీ క్రికెట్ లో ఆమ్లా గణాంకాలు రికార్డులే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పనుకున్నాక ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 265 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆమ్లా 19521 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్.. 311 నాటౌట్. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 247 మ్యాచుల్లో10020 పరుగులు చేశాడు.హైయెస్ట్ స్కోరు 159. ఇక టీ20 క్రికెట్ లో 164 మ్యాచుల్లో 2 సెంచరీల సాయంతో 4563 పరుగులు చేశాడు. ఈ తరం క్రికెట్ అభిమానులకు ఆమ్లా తెలియకపోవచ్చేమో కానీ, 20’s కిడ్స్ కు పరిచయం అక్కర్లేని ఆటగాడు. ఆమ్లా ఎంతటి విలువైన ఆటగాడో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JUST IN: Hashim Amla has announced his retirement from all forms of the game.
The South African great retires with 89 professional hundred to his name.
What’s your favourite memory from Amla’s career? pic.twitter.com/o7iCvjCwiR
— Wisden (@WisdenCricket) January 18, 2023