క్రికెట్‌లో క్యాచ్ మిస్ చేస్తే ఎంత నష్టమో మరోసారి పాకిస్తాన్ నిరూపించింది. టీ20 వరల్డ్ కప్ 2021లో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ అద్భుతంగా ఆడి భారీ స్కోరే చేసింది. బౌలింగ్‌లోనూ 15 ఓవర్ల వరకూ మ్యాచ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకుంది. 15 ఓవర్లు ముగిసే సరికి 115 పరుగులు చేసిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ గెలవాలంటే 30 బంతుల్లో 62 పరుగులు చేయాలి.
పాక్ బౌలింగ్ అటాక్ చూస్తే ఆసీస్ గెలవడం కష్టంగానే అనిపించింది క్రికెట్ ఫ్యాన్స్‌కు. అంతా పాక్ ఫైనల్ చేరడం ఖాయం అనుకున్నారు. ఈ క్రమంలో మ్యాథూ వేడ్ చెలరేగాడు. అతనికి తోడు మార్కస్ స్టోయినిస్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. కాగా 10 బంతుల్లో 20 పరుగుల చేయాల్సిన దశకు ఆసీస్ చేరింది. ఇలాంటి కీలక సమయంలో షాహిన్ అఫ్రిదీ బౌలింగ్‌లో వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను పాక్ బౌలర్ హసన్ అలీ నేలపాలు చేశాడు. దీంతో ఒక్కసారిగా పాక్ ఫ్యాన్స్ తెల్లబోయారు. ఆసీస్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఆ క్యాచ్ మరీ అంత క్లిష్టమైనది కాదు కానీ.. హసన్ అలీ అందుకోలేకపోయాడు. దాంతో బతికిపోయిన వేడ్ ఇక మరో చాన్స్ ఇవ్వకుండా.. క్యాచ్ డ్రాప్ అయిన బంతికి 2 పరుగులు తీసుకున్నాడు. ఇక 9 బంతుల్లో 18 కొట్టాలి… వరుసగా 6,6,6 మూడు సిక్సులు కొట్టి ఇంకో ఓవర్ ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు వేడ్.
హసన్ అలీ కనుక వేడ్ క్యాచ్ పట్టిఉంటే కచ్చితంగా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపేది. ఆ క్యాచ్ మిస్ అవ్వడంతో హసన్ అలీతో పాటు పాకిస్తాన్ కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. అలాగే ఆసీస్ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్‌లో పలు క్యాచ్‌లను జారవిడిచారు. ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన ఆసీస్ కూడా చెత్త ఫీల్డింగ్ చేసింది. వార్నర్, స్మిత్ కూడా క్యాచ్‌లను వదిలేశారు. ఇక గ్రూప్ దశలో అద్భుతంగా ఆడి ఐదుకు 5 మ్యాచ్‌లలో విజయం సాధించిన పాక్.. ఆసీస్‌ను మాత్రం నిలువరించలేకపోయింది. మరి హసన్ అలీ మిస్ చేసిన క్యాచ్, పాకిస్తాన్ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hasan ali droped catch
😄👈 pic.twitter.com/AEuHEv1dWD— Ahmad khan (@AhmadkhanOKz) November 11, 2021