టీమిండియా సీనియర్ ఆటగాళ్ల జట్టు ఒకవైపు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పట్టుబిగిస్తుంటే.. మరోవైపు కుర్రాళ్ల జట్టు టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు టీ20, మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం టీమిండియా టీ20 జట్టు ఇంగ్లండ్‌లోని క్లబ్ జట్టు నార్త్ అంప్టెన్‌షైర్‌తో ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నార్త్‌అంప్టెన్‌షైర్ జట్టు బౌలర్ కమ్ కెప్టెన్ జోష్ కాబ్ షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తొలి బంతికే అవుట్ చేసి దెబ్బతిశాడు. మూడో ఓవర్‌లో అయితే టీమిండియా దెబ్బమీద దెబ్బ పడింది. బ్రండన్ గ్లోవర్ మూడో ఓవర్ మూడో బంతికి రాహుల్ (7)చివరి బంతికి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేసి సంచలనం సృష్టించాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే 3 టాప్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఓపెనర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. 16 పరుగులు చేసిన కిషన్.. ఫ్రెడ్డీ హెల్డ్రీచ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. 34 పరుగులతో మంచి టచ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ కూడా ఫ్రెడ్డీ హెల్డ్రీచ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా నిఖార్సయిన బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో టీమిండియా గడ్డుపరిస్థితి ఎదుర్కొంది. కానీ.. హర్షల్ పటేల్ బ్యాట్‌తో మ్యాజిక్ చేసి టీమిండియాకు 149 పరుగుల స్కోర్ అందించాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేసి అదరగొట్టాడు.
హర్షల్ పటేల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌ను చూసి ఫ్యాన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టులో పేసర్ బుమ్రా ఒకే ఓవర్‌లో 29 రన్స్ కొట్టి సంచలనం సృష్టిస్తే.. హర్షల్ పటేల్ హాఫ్ సెంచరీ చేసి మరింత మెస్మరైజ్ చేశాడు. ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ అంప్టెన్‌షైర్‌ను టీమిండియా బౌలర్లు 139 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harshal Patel vs Northamptonshire 👇
54 (36) with the bat
2-23 with the ballWill he be in India’s XI in the first #ENGvIND T20I? https://t.co/rCI45Lp2RG
— ESPNcricinfo (@ESPNcricinfo) July 4, 2022