క్రికెట్ లో ఐర్లాండ్ బ్యాటర్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణిస్తూ.. సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడమే గాక.. టీంఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మని దాటేసి చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ లో ఐర్లాండ్ ఒక పసికూన జట్టని అందరు భావిస్తారు. కానీ ఐర్లాండ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆ ట్యాగ్ నుండి దూరమయ్యే ప్రయత్నం చేస్తుంది. జట్టులో సరైన వ్యూహాలు లేక విఫలమవుతున్నారు తప్ప.. ప్రతిభ గల క్రికెటర్లుకి కొదువ లేదు. అయితే ఐర్లాండ్ అంటే చాలా మందికి స్టిర్లింగ్, బాల్బిర్ని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ప్రస్తుతం ఒక యువ సంచలనం దూసుకొస్తున్నాడు. అతడెవరో కాదు ఐర్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ టెక్టార్. గత కొంతకాలంగా ఫార్మాట్ ఏదైనా టెక్టార్ నిలకడగా రాణిస్తూ.. సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడమే గాక.. టీంఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మని దాటేసి చరిత్ర సృష్టించాడు.
ఇటీవలే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ముగించుకున్న ఐరిష్ టీం.. 0-2 తో సిరీస్ కోల్పోయింది. తొలి వన్డేలో ఫలితం తేలకపోగా.. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో కూడా బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డేలో టెక్టార్ భారీ సెంచరీని నమోదు చేసాడు. 113 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో 140 పరుగులు చేసాడు. దీంతో ఐర్లాండ్ చరిత్రలోనే ఒక ప్లేయర్ వన్డే ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్స్ సంపాదించుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఈ రికార్డ్ స్టిర్లింగ్ ఇప్పటివరకు స్టిర్లింగ్ పేరిట ఉంది. స్టిర్లింగ్ ఖాతాలో 697 రేటింగ్ పాయింట్లు ఉండగా.. తాజాగా 722 రేటింగ్ పాయింట్లతో టెక్టార్ ఆ రికార్డుని అధిగమించాడు.
ఇదిలా ఉండగా.. టెక్టార్ మరో అరుదైన రికార్డుని అందుకోవడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్ లో 7 వ స్థానాల్లో నిలిచి కోహ్లీ , రోహిత్ శర్మ కన్నా ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 8 వ ర్యాంక్ లో ఉండగా.. రోహిత్ శర్మ 10 వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో, దక్షిణాఫ్రికా బ్యాటర్ వండెర్ డస్సెన్ రెండో స్థానంలో ఉన్నారు. మొత్తానికి నిలకడగా ఆడుతున్న టెక్టార్ ఒకేసారి రెండు రికార్డులని నెలకొల్పాడు. ఒక పసికూన బ్యాటర్ అయినప్పటికీ వన్డేల్లో టాప్ 10 లో చోటు దక్కించుకోవడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.