అందరూ ఐపీఎల్ బిజీలో ఉంటే.. ఐర్లాండ్ యంగ్ క్రికెటర్ ఏకంగా కోహ్లీ స్థానానికి టెంటర్ పెట్టేశాడు. దాటేశాడు కూడా. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఓవరాల్ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ, సొంతం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఐర్లాండ్ యంగ్ క్రికెటర్ ఏకంగా కోహ్లీనే దాటేశాడు. ఏకంగా ఓ విషయంలో ముందుకెళ్లిపోయాడు. విరాట్ ఫ్యాన్స్ ని ఇప్పుడు ఈ విషయం అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఏంటా రికార్డ్? ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ బిజీలో ఉన్నారు. సీజన్ చివరికొచ్చేసినా సరే ప్లే ఆఫ్స్ లోకి ఏయే జట్లు అడుగుపెడతాయనేది క్లారిటీ రావడం లేదు. చెప్పాలంటే ప్రతి మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇలాంటి టైంలో ఐర్లాండ్ కుర్రాడు హ్యారీ టెక్టర్ వన్డేల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ చేశాడు. బంగ్లాదేశ్ తో తాజాగా జరిగిన వన్డే సిరీస్ లో సూపర్ బ్యాటింగ్ చేశాడు. మూడు వన్డేల సిరీస్ లో వరసగా 21, 140, 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తం 3 మ్యాచుల్లో కలిపి 206 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ తరఫున అరుదైన ఘనత సాధించాడు.
ఐర్లాండ్ తో వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ 2-0 తేడాతో విజయం సాధించింది. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న హ్యారీ టెక్టర్.. వన్డే ర్యాంకింగ్స్ లో ఏడో స్థానానికి ఎగబాకాడు. దీంతో ఆ ప్లేసులో ఉన్న కోహ్లీ.. ఎనిమిదికి పడిపోయాడు. 8లో ఉన్న డుప్లెసిస్ 9వ ప్లేస్ కి పడిపోయాడు. ప్రస్తుతం 722 పాయింట్లతో ఉన్న హ్యారీ.. ఐర్లాండ్ తరఫున అత్యధిక ర్యాంకింగ్ పాయింట్స్ అందుకున్న ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ర్యాంకింగ్స్ లో కోహ్లీని 23 ఏళ్ల ఐర్లాండ్ క్రికెటర్ అధిగమించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.