ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సంచలనం నమోదు చేశాడు. టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నాడో ఏమో కానీ.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదేశాడు. వన్డేలు, టీ20 లాంటి ఫార్మాట్లలోనే ఈ ఫీట్‌ను గొప్పగా చెప్పుకుంటే.. బ్రూక్ మాత్రం టెస్టు మ్యాచ్‌లో కొట్టేశాడు. తొలి బంతికి పరుగులు రాలేదు కానీ.. లేకుంటే.. ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొట్టేవాడిలా కనిపించాడు. అదే జరిగి ఉంటే టెస్టు క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచేవాడు. కానీ.. ఈ ఐదు సిక్సుల రికార్డు కూడా ఏం తక్కువ కాకపోయినా.. ఇది లెక్కలోకి రాదు. ఎందుకంటే మనోడు కొట్టింది ప్రాక్టీస్ మ్యాచ్‌లో.
టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్.. సిరీస్ ఆరంభానికి ముందు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను తమ స్టైల్లోనే చేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా వచ్చిన తర్వాత.. ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్ ఆడే విధానమే మారిపోయింది. చాలా అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నారు. ఈ స్ట్రాటజీని ఉపయోగించి ఇంగ్లండ్ జట్టు సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, మెక్‌కల్లమ్ కోచ్‌గా ఇంగ్లండ్ ఆడిన చివరి 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. ఇది నిజంగా అద్భుతమైన రికార్డే. ఇదంతా.. వారి ‘బజ్‌బాల్’ స్ట్రాటజీతోనే వర్క్‌అవుట్ అవుతుంది.
ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా ఇదే అగ్రెసివ్ స్ట్రాటజీని ఉపయోగించబోతున్నట్లు ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే చెప్పేసింది. న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన కివీస్ దేశవాళీ క్రికెటర్ ఆదిత్య అశోక్ వేసిన ఓవర్‌లో హ్యారీ బ్రూక్ ఏకంగా 5 సిక్సులు బాదడమే కాకుండా 71 బంతుల్లోనే 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. బ్రూక్ కొట్టిన సిక్సుల్లో ఓ రెండు సిక్సులు ఏకంగా స్టేడియం బయట రద్దీగా ఉండే రోడ్డుపై పడ్డాయి. అలాగే టెస్టు స్పెషలిస్ట్ జో రూట్ సైతం 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇలా ఇంగ్లండ్ తొలి 26 ఓవర్లలోనే 206 పరుగులు బాదేసింది. తొలి రోజు 52 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. దీంతో.. ఇంగ్లండ్ టెస్టుల్లో తమ శైలి ఏ మాత్రం మార్చుకోలేదని మరోసారి స్పష్టమైంది. మరి ఇంగ్లండ్ అగ్రెసివ్ క్రికెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harry Brook smashed 5 sixes in a single over in the warm-up match ahead of New Zealand Tests. pic.twitter.com/IZ5sjYfaES
— Johns. (@CricCrazyJohns) February 8, 2023