30 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును ఓ 24 ఏళ్ల కుర్రాడు బద్దలు కొట్టేశాడు. టీమిండియా మజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నెలకొల్పిన రికార్డు కనుమరుగైపోయింది.
ప్రపంచ రికార్డు బద్దలైంది. అప్పుడెప్పుడో 1993-95 మధ్య టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కాంబ్లీ పేరిట దాదాపు 30 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. ఆ రికార్డును తాజాగా ఓ యువ క్రికెటర్ బద్దలు కొట్టాడు. 30 ఏళ్లుగా ఎంతో మంది హేమాహేమీ క్రికెటర్లకు సాధ్యంకాని ఆ రికార్డును 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ బద్దలుకొట్టి.. కొత్త చరిత్ర లిఖించాడు.
ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్.. కేవలం ఆరు నెలల కిందే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పట్టుమని పది మ్యాచ్‌లు ఆడకుండానే 29 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలుకొట్టాడు. ప్రస్తుతం తన కెరీర్‌లో కేవలం 6వ టెస్టు మాత్రమే ఆడుతున్న బ్రూక్.. తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో ఏకంగా 807 పరుగులు చేసి.. ప్రపంచ క్రికెట్‌లో తొలి తొమ్మిది టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కొన్ని గంటల ముందు వరకు కూడా ఈ రికార్డు వినోద్ కాంబ్లీ పేరిట ఉండేది.
వినోద్ కాంబ్లీ తన తొలి తొమ్మిది టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 798 పరుగులు చేశాడు. అలాగే సునీల్ గవాస్కర్ సైతం 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 778 రన్స్ చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు హ్యారీ బ్రూక్, కాంబ్లీ రికార్డును బ్రేక్‌చేసి తొలి స్థానంలోకి రావడంతో కాంబ్లీ రెండో ప్లేస్‌కు, గవాస్కర్ నాలుగో స్థానంలో నిలిచారు. అయితే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బ్రూక్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం 169 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సులతో 184 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. మరి బ్రూక్ ఆడుతున్న తీరు, అతను సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most runs after first 9 test innings :
Harry brook – 807*
Vinod kambli – 798 runs
Herbert scutliffe – 780 runs
Sunil Gavaskar – 778 runs
Everton weekes – 777 runs— Raja Sekhar Yadav (@cricketwithraju) February 24, 2023
Harry Brook becomes the first player to score 800 runs in his first nine Test innings. They’ve come off just 803 balls.
A very special talent ✨ pic.twitter.com/XozHjdiPqe
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2023