ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమితో కామన్‌వెల్త్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిరాశాజనకంగా ప్రారంభించిన భారత మహిళల జట్టు, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది.
ఇంతకుముందు టీ20ల్లో టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని (41 విజయాలు) ఉండేవాడు. ధోనీ 72 టీ20 మ్యాచ్‌ల్లో 41 విజయాలు సాధించాడు. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ 71 మ్యాచ్‌ల్లోనే 42 విజయాలతో ధోనిని మించిపోయింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 30 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
Harmanpreet Kaur equals MS Dhoni’s record for most T20I victories as an Indian captain.#CricTracker #MSDhoni #HarmanpreetKaur #CWG2022 #CricketTwitter pic.twitter.com/v8EvYBHo8r
— CricTracker (@Cricketracker) August 1, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది.
With Smriti Mandhana on top form, India’s chase was never in doubt ✌️ #INDvPAK #B2022 #CWG22
👉 https://t.co/lFlr1j0DuK pic.twitter.com/CuOgYAuowl
— ESPNcricinfo (@ESPNcricinfo) July 31, 2022
ఇదీ చదవండి: Tristan Stubbs: వీడియో: నమ్మశక్యంకాని రితీలో క్యాచ్ అందుకున్న ఫీల్డర్! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా
ఇదీ చదవండి: Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్! మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్న దాదా