పాకిస్థాన్ యువ తరం క్రికెటర్లు ఆటతో కంటే వివాదాలు, పిల్ల చేష్టలతోనే ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. తాజాగా పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ ఫీల్డర్‌పై చేయి చేసుకుని దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా సోమవారం లాహోర్ ఖలందర్స్, పెషావర్ జాలిమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహోర్ జట్టు తరపున ఆడుతున్న పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్‌ను ఆ జట్టు ఆటగాడు కమ్రాన్ గులామ్ జారవిర్చాడు. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రౌఫ్.. తర్వాత ఆ బ్యాట్స్‌మెన్‌ను తన బౌలింగ్‌లోనే అవుట్ చేశాడు.
దీంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. తన దగ్గరికి వచ్చిన కమ్రాన్ గులామ్ చెంపచెళ్లు మనిపించాడు రౌఫ్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రౌఫ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్ వదిలేసినందుకు ఒక ఆటగాడిపై చేయి చేసుకుంటారా? అంటూ మండిపడుతున్నారు. కాగా రౌఫ్ కొట్టిన దెబ్బను లైట్ తీసుకున్న కమ్రాన్ దాన్ని అంతగా పట్టించుకోలేదు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Haris Rauf slaps Kamran Ghulam for dropping catchPacer Haris Rauf slapped teammate Kamran Ghulam for dropping a catch during the ongoing HBL Pakistan Super League (PSL) match between Lahore Qalandars and Peshawar Zalmi. pic.twitter.com/9sROM1bh28
— King Sports (@Kingsports01) February 21, 2022