టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ స్టేడియంలో ఈ దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్ ఫ్యాన్స్ కొన్ని రోజుల పాటు అదే మ్యానియాలో ఉండిపోతారు. ఇరు దేశాల ఆటగాళ్లపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఇండియాకైనా, పాకిస్థాన్‌కైనా అన్ని దేశాలతో ఆడే మ్యాచ్‌లు ఒక ఎత్తు అయితే దాయాది పోరు మరో ఎత్తు. పైగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్‌లు జరగపోవడం, కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లోనే తలపడుతుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.
ఇటివల ముగిసిన ఆసియా కప్ 2022లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన భారత్-పాక్ మరోసారి ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఢీకొననున్నాయి. ఈ క్రేజీ మ్యాచ్‌కు ఇంకా చాలా సమయమే ఉన్నా.. పాకిస్థాన్ ఆటగాళ్లు అప్పుడే మాటల యుద్ధానికి తెరలేపారు. పాక్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ కవ్వింపు కామెంట్లు చేశాడు. అతను మాట్లాడుతూ..‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయే ఎంసీజీ(మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) తనకు హోం గ్రౌండ్ లాంటిది. ఎందుకంటే బిగ్‌బాష్ లీగ్‌లో నేను మెల్‌బోర్న్ స్టార్స్‌కు చాలా మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాను. దీంతో మెల్‌బోర్న్‌లో అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం నాకుంది. ఈ గ్రౌండ్‌లో నన్ను ఎదుర్కొవడం టీమిండియాకు అంత సులవైన విషయం కాదు. ఇప్పటి నుంచే టీమిండియా కోసం పక్కా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని రౌఫ్ వెల్లడించాడు.
కాగా ఆసియా కప్‌లో భారత్-పాక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హరీస్ రౌఫ్ భాగమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చిన రౌఫ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సూపర్ ఫోర్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రౌఫ్ 38 పరుగులు ఇచ్చి కేవలం ఒక్కటే వికెట్ పడగొట్టాడు. కానీ.. ఆస్ట్రేలియాలో తన తడాఖా ఏంటో చూపిస్తానంటూ కామెంట్లు చేస్తున్నాడు. కాగా.. హరీస్ రౌఫ్ వ్యాఖ్యలపై టీమిండియా ఆటగాళ్లు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వనప్పటికీ భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఒక రేంజ్‌లో స్పందిస్తున్నారు. ‘మాటలొద్దు బాబు.. గ్రౌండ్‌లో చూసుకుందాం’ అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎంసీజీ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
Haris Rauf is excited to play against India in the T20 World Cup at MCG on 23rd October.#T20WorldCup2022 | @HarisRauf14 pic.twitter.com/wBhPPQCXCk
— CricTracker (@Cricketracker) September 29, 2022
ఇది కూడా చదవండి: థ్రిల్లింగ్ ఫినిష్.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్..!