క్రికెట్ అభిమానులందరూ వేయి కళ్లతో ఎదురు చూసిన ఇండియా-పాకిస్థాన్ అదిరిపోయే వినోదాన్ని అందించి ముగిసింది. క్రికెట్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హై ఓల్టేజ్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగి.. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజాను పంచింది. ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్‌ను భారత్ బౌలర్లు వణికించారు. దీంతో పాకిస్థాన్ ముక్కిమూలిగి 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక చిన్న లక్ష్యమే కాదా టీమిండియా ఊదేస్తుందని అంతా భావించారు. కానీ.. అంత సీన్ లేదంటూ పాక్ యంగ్ బౌలర్ నసీమ్ షా తొలి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్‌ను డకౌట్ చేసి సవాలు విసిరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బౌలర్లు కట్టిపడేశారు. ఇలా అయితే కష్టమని భారీ షాట్లకు ప్రయత్నించిన రోహిత్(12), కోహ్లీ(35) పాక్ బౌలర్లకు చిక్కారు. అప్పటికి టీమిండియా స్కోర్ 53 మాత్రమే.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా అచితూచి ఆడి.. కొద్ది సేపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కావాల్సిన రనేరేట్ కొండెక్కింది. ఇక బ్యాట్ ఝుళిపించక తప్పని పరిస్థితుల్లో సూర్యకుమార్ కుమార్ కూడా 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చినా 16, 17 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో.. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 31 పరుగలు అవసరం అయ్యాయి. విజయం కాస్త కష్టంగానే కనిపిస్తున్న ఈ తరుణంలో 18 ఓవర్‌లో జడేజా ఒక ఫోర్, ఒక సిక్స్‌తో, 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఇక చివరి ఓవర్‌లో కేవలం 7 పరుగులు కావాలి. ఇంకేముంది టీమిండియా విజయం ఖాయంగా కనిపించింది. కానీ.. అవతల పాకిస్థాన్ ఉంది. టీమిండియాతో మ్యాచ్ అంటే వాళ్లు అంత ఈజీగా వదిలిపెట్టరు. చివరి ఓవర్ తొలి బంతికి జడేనా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అంతే మ్యాచ్‌లో మరో ట్విస్ట్. కానీ.. క్రీజ్‌లోకి వచ్చేది ది ఫినిషర్ డీకే(దినేష్ కార్తీక్) కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. కానీ రెండో బంతిని డీకే సింగిల్ తీయడంతో.. 4 బంతుల్లో 6 పరుగులు అవసరం అయ్యాయి. మూడో బంతిని హార్దిక్ పాండ్యా కవర్స్ లోకి ఆడగా.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ వెంటనే పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. ఆశ్చర్యకరంగా హార్దిక్ పాండ్యా ఆ సింగిల్‌ను నిరాకరిస్తూ.. ‘కంగారు పడకు డీకే బ్రో.. నేను చూసుకుంటా..’ అన్నట్లు ఒక అదిరిపోయే సైగ చేస్తాడు. కానీ.. అప్పటికే 3 బంతులు మాత్రమే మిగిలి ఉంటాయి. 6 పరుగులు కావాలి. ఏదైన తేడా జరిగితే మరోసారి పాక్ చేతిలో ఘోర పరాభవం తప్పదు. కానీ.. తన బలమేంటో తనకు బాగా తెలిసిన పాండ్యా దినేష్ కార్తీక్‌కు చేసిన ‘నేను చూసుకుంటా’ అనే కాన్ఫిడెన్స్‌కు వందశాతం న్యాయం చేస్తూ.. తర్వాతి బంతిని లాంగన్‌లోకి భారీ సిక్స్ బాది టీమిండియాకు అద్వితీయ విజయం అందిచాడు.
ఈ షాట్‌తో భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగుల లక్ష్యఛేదించి.. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. కాగా.. చివరి సిక్స్‌కు ముందు హార్దిక్ పాండ్యా చూపించిన కాన్ఫిడెన్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పాండ్యా ఎక్స్‌ప్రెషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బౌలింగ్, బ్యాటింగ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యాకు దినేష్ కార్తీక్ కూడా ఊహించని రీతిలో బౌ డౌన్‌తో గౌరవిస్తాడు. సిక్స్‌కు ముందు పాండ్యా చూపిన కాన్ఫిడెన్స్‌కు దినేష్ కార్తీక్ సైతం ఫిదా అయిపోయాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘బాబర్ ఆజమ్.. అన్ని ఫార్మాట్లలోనూ టాప్ బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ!
Positive Thinking:
I know the Bowler has lot of Pressure on Bowling last over.
This Gives you #Confidence & #Win#IndiaWon #IndiaVsPak #INDvsPAK #Asiacup2022Congratulations #TeamIndia
Amazing batting by @hardikpandya7 @imjadejaMarvelous Tremendous Fabulous
Unbelievable pic.twitter.com/aQa78QwM9D— TRS Scared of BJP (@RameshM_FTFGC) August 28, 2022
Winning 6️⃣ @hardikpandya7 @DineshKarthik @surya_14kumar @imjadeja #IndiaVsPakistan Match 🏏. #AsiaCup2022 @ICC @cricketworldcup @BCCI pic.twitter.com/Vccm6Ce2Aq
— Ms Srikanth 🇮🇳 (@MsSrikanth1) August 29, 2022
Dinesh Karthik bowed down to Hardik Pandya after he finished the game. pic.twitter.com/z9VhblklKI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2022
Beautiful Moment in India Vs Pak Match Today. Dinesh Karthik bowed before Hardik Pandya. Well done Team India. #INDvsPAK #IndiaVsPakistan #IndianCricketTeam #HardikPandya #DineshKarthik #AsiaCup2022 pic.twitter.com/vuro2ZXd7H
— Tarique Anwer (@tariqueSH) August 28, 2022