ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ఫోకస్ మొత్తం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌పైనే ఉంది. టోర్నీ ఆరంభానికి 17 రోజుల ముందుగానే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత బృందం. పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. సోమవారం వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ ఆడిన టీమిండియా.. నేడు(బుధవారం) న్యూజిలాండ్‌తో మరో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా విజయంతో మంచి జోరుమీదున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై కూడా మంచి ప్రదర్శన కనబర్చాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మీడియాలో మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్‌గా తన సక్సెస్‌కు కారణాలను వివరించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెప్పిన ఒక మాట తనన ఈ రోజు ఆల్‌రౌండర్‌గా ఈ స్థాయిలో నిలబెట్టందని పాండ్యా అన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు.. వ్యక్తిగత స్కోర్‌పై కాకుండా జట్టు స్కోర్‌ను బట్టి ఆడాలని ధోని తనతో చెప్పినట్లే పాండ్యా వెల్లడించాడు. అప్పటి నుంచి ఆటను తానే చూసే దృకోణం మారిపోయిందని అన్నాడు. అప్పటి నుంచి జట్టు పరిస్థితులను బట్టి ఆడటం అలవాడు చేసుకున్నానని పాండ్యా పేర్కొన్నాడు. అదే నన్ను ఒక పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా మార్చిందని, నేను ఇలా మంచి ఆల్‌రౌండర్ అవ్వడానికి ప్రధాన కారణం ధోనినే అని, అతను చెప్పిన మాటను ప్రతి మ్యాచ్‌లో నాకు గుర్తుకు వస్తుందని తెలిపాడు.
కాగా.. ఐపీఎల్ 2022కు ముందు పూర్ ఫామ్, గాయాలతో టీమిండియాలో చోటు కోల్పోయిన పాండా.. ఆ తర్వాత వెన్నుముక సర్జరీ చేయించుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ కావడంతో పాటు ఆ జట్టును అద్భుతంగా నడిపించి.. ఏకంగా తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ సీజన్ కంటే ముందు బౌలింగ్‌కు పూర్తిగా దూరమై.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఇండియా టీమ్‌లో కొనసాగిన పాండ్యా.. ఐపీఎల్ 2022లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన ఆధారంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా దుమ్ములేపుతున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాలో కీ ప్లేయర్‌గా ఉన్నాడు.
Hardik Pandya 🦁 :
“Dhoni bhai taught me one lesson – ‘Stop thinking about your score and start focusing on what your team requires’. That helped me a lot to become a better cricketer” 🥳💛@MSDhoni | #MSDhoni | #WhistlePodu ⚡️
— 𝐀. (@Arnav_Tweetz7) July 15, 2022