కొత్త సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందనంగా గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దిపక్ హుడా అద్భుత బ్యాటింగ్ కు తోడు యంగ్ బౌలర్స్ శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ల పేస్ తోడుకావడంతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం ఏదైనా ఉందా అంటే.. అది లాస్ట్ ఓవర్ అక్షర్ పటేల్ కు ఇవ్వడమే. అప్పటికే అద్భుతమైన బౌలింగ్ వేసి మంచి స్వింగ్ లో ఉన్న పాండ్యా.. తాను బౌలింగ్ వేయకుండా అక్షర్ కు ఎందుకు ఇచ్చాడన్నదే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. ఈ ప్రశ్నకు మ్యాచ్ అనంతరం సమాధానం ఇచ్చాడు పాండ్యా.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలిచింది. శ్రీలంక విజయానికి చివరి ఓవర్ లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకోవాల్సింది పోయి బంతిని అక్షర్ పటేల్ కు ఇచ్చాడు. దాంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైయ్యారు. అయితే లంక బౌలర్లు క్రీజ్ లో ఉండటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అద్భుతంగా బౌలింగ్ వేసిన అక్షర్ ఈ ఓవర్ లో 11 పరుగులు ఇచ్చాడు. దాంతో రెండు రన్స్ తో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం అక్షర్ కు బౌలింగ్ ఎందుకు ఇచ్చావు అని పాండ్యాని అడగ్గా..”కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా జయించాలో మా వాళ్లకు తెలియాలి అనే బంతిని అక్షర్ పటేల్ కు ఇచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లోని అనుభవం వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఎంతో ఉపయోగపడుతుంది. మేం ద్వైపాక్షిక సిరీస్ లల్లో బాగా ఆడుతామని మాకు తెలుసు. ఇక ఈ రోజు ఈ ఒత్తిడిని మా కుర్రాళ్లు జయించారు” అని చెప్పుకొచ్చాడు పాండ్యా. దాంతో పాండ్యా చేసిన పనికి క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు.
వచ్చే వరల్డ్ కప్ నేపథ్యంలో ఒత్తిడిని ఎలా జయించాలో ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటేనే విజయాలు సాధించగలరని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దిపక్ హుడా 23 బంతుల్లో 4 సిక్స్ లు, ఓ ఫోర్ తో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడికి తోడు అక్షర్ పటేల్ కూడా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో ఇషాన్ కిషన్ (37), కెప్టెన్ పాండ్యా (29) పరుగులు చేశారు. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 రన్స్ కు ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ దసూన్ షణక ఒక్కడే 45 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లతో సత్తా చాటాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీశారు.
Surprised to see Axar bowling the final over? Here’s Captain @hardikpandya7 revealing the reason behind the move. #INDvSL #TeamIndia @mastercardindia pic.twitter.com/dewHMr93Yi
— BCCI (@BCCI) January 3, 2023