హార్దిక్ పాండ్యా.. ఆరు నెలల పాటు టీమిండియాకి, క్రికెట్ దూరంగా గడినా కూడా పునరాగమంలోనే గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ 2022 ట్రోఫీ అందించాడు. కెప్టెన్ ఎలాంటి అనుభవం లేకుండానే.. టైటిల్ కొట్టి ఔరా అనిపించాడు. వెన్నెముకకు సర్జరీ చేయించుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అతనిపై వచ్చిన విమర్శలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హార్దిక్ పాండ్యా స్పందించాడు. నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నాకు తెలుసు.. విమర్శలకు సమాధానం చెప్పడం నా పని కాదు.. అంటూ హార్దిక్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఘోర వైఫల్యం తర్వాత హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ మైదానంలోకి కూడా దిగలేదు. తన పునరాగమనం మీదనే దృష్టి పెట్టిన అతను ఆరు నెలల సెలవులో కఠోర శ్రమ చేశాడు. తన ఫిట్ నెస్ ని పెంచుకోవడం, బౌలింగ్ పై దృష్టి పెట్టడం చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హార్దిక్ చేసిన ప్రదర్శన అందరూ చూశారు.
ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రిటైన్ చేసుకోకపోవడం కూడా హార్దిక్ పై వచ్చిన విమర్శలకు మరింత ఊపందించింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా హార్దికా పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వడం. చూస్తుండగానే జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చడం, ఫైనల్ చేర్చి.. టైటిల్ ని సాధించడం అంతా అలా ఓ మ్యాజిక్ లా జరిగిపోయాయి. ఫ్రాంచైజ్ పాల్గొన్న తొలి సీజన్లోనే హార్దిక్ పాండ్యా టైటిల్ అందించి అందరి ప్రశంసలు పొందాడు.
ఆ ప్రదర్శనతోనే టీమిండియాలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో స్థానం సంపాదించాడు. సఫారీలతో తొలి టీ20లో బాల్ తో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బ్యాటింగ్ విషయంలో మాత్రం అదరగొట్టాడు. కేవలం 12 బంతుల్లోనే 3 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన కెరీర్, ఫిట్ నెస్ కు సంబంధించి వచ్చిన అన్ని విమర్శలపై బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా స్పందించాడు.
‘ట్రైనింగ్ సెషన్ లో ఉన్నా తగినంత రెస్ట్ తీసుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకునేవాడిని. ఈ గ్యాప్ లో నేను ఎన్నెన్నో త్యాగాలు చేశాను. రోజూ తెల్లవారు జామునే 5 గంటలకే నిద్ర లేచేవాడిని.. రాత్రి 9.30 గంటలకల్లా నిద్రపోయేవాడిని. ఐపీఎల్ కి ముందు నాతో నేను పెద్ద యుద్ధమే చేశాను. నేను పడిన శ్రమకు తగిన ఫలితాన్ని అందుకున్న తర్వాత ఎంతో సంతృప్తిగా అనిపించింది.’
‘నాకు మొదటి నుంచి కష్టపడటమే అలవాటు.. ఫలితాల గురించి పెద్ద ఆలోచించేవాడిని కాదు. అందుకే ఈ విజయాలకు ఉప్పొంగిపోవడం లేదు. ఒక రోజు, ఒక క్షణానికి సంబంధించింది కాదు.. ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నదే అసలు విషయం’ అంటూ హార్దిక్ పాండ్యా స్పందించాడు. హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
From emotions on making a comeback to #TeamIndia and #TATAIPL triumph to goals for the future. 👏 👍
DO NOT MISS as @hardikpandya7 discusses this and more. 👌 👌
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm https://t.co/2q8kGRpyij pic.twitter.com/BS2zvnxbpP
— BCCI (@BCCI) June 11, 2022