చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులోనూ చవకగా ఇంటర్నెట్ డేటా.. ఇంకేముంది అందరికి సోషల్ మీడియాలోనే కాలక్షేపం. ఇదే ఇప్పటి కాలం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు జనాలు. సోషల్ మీడియా వినియోగం లేని సమయంలో ఏదైనా ఓ వార్త జనాలకు చేరాలంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. తాజాగా టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది.
టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన సిక్స్ బాడీని ప్రదర్శిస్తూ దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజనులు.. పాండ్యా అచ్చం అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ కార్మెలో హేస్ మాదిరి ఉన్నాడంటూ కామెంట్ చేయసాగారు. ఇద్దరు శరీర ఆకృతులు ఒకేలా ఉన్నాయంటూ వారి ఫోటోలో పోస్ట్ చేయడం మొదలు పెట్టేశారు. ఇక హర్దిక్.. క్రికెట్ తర్వాత ఎన్‌ఎక్స్‌టీలోకి ప్రవేశిస్తాడని.. వీరిద్దరు తలపడితే ఇలా ఉంటుంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
When Carmelo Hayes Meets Hardik Pandya👀👀 pic.twitter.com/pBShSZGXUS
— HearttBreakkKidd (@Rohit_RatedR) February 22, 2022
ఇక అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురుంచి అందరకి తెలుసు.. ఈ మధ్యనే ఐపీఎల్ కొత్త ప్రాంచైజీలల్లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక కార్మెలో హేస్ అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్. ఇక ఏదైనా ఒక వార్తను సృష్టించాలంటే అది నెటిజన్లకు సాధ్యం.వారు అనుకోవాలే కానీ.. నిమిషాల్లో సృష్టించగలరు.. వైరల్ చేయగలరు. హర్దిక్ పాండ్య ఫోటో విషయంలో కూడా నెటిజనలు అలానే వైరల్ చేశారు. ఈ పోస్ట్ పై హేస్ కూడా స్పందించారు “@hardikpandya7 మీవల్లే నేను భారత్ లో ట్రేండింగ్ లో ఉన్నాను.. ధన్యవాదాలు’’ అని తెలిపాడు. మరి హార్దిక్ పాండ్యా, అమెరికన్ రెజ్లర్ కార్మేలో హేస్ పోలికపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
.@hardikpandya7 has me trending in India. Much love 🤟🏾
— Carmelo Hayes (@Carmelo_WWE) February 22, 2022
After making a successful career in Cricket. Hardik pandya debuts in NXT pic.twitter.com/j4eDX0RZZZ
— Ansh Saxena (@iam_kakarot69) February 22, 2022