అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన చివరి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను ఏకంగా 168 పరుగుల తేడాతో ఓడించి.. టీ20 చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ బాదిన గిల్.. మొత్తం మీద 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 126 పరుగులు చేసి.. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన 122 పరుగులే టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది. ఆ రికార్డును గిల్.. న్యూజిలాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో బద్దలు కొట్టాడు. ఇక 235 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లను భారత బౌలర్లు వణికించారు. పేసర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ కేవలం 66 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు’ అందుకున్న టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్దులను తానసలు పట్టించుకోనని, తన అవార్డుకు ముందే మ్యాచ్‌లో కొన్ని అద్భుత ప్రదర్శనలు వచ్చాయని అన్నాడు. ఈ సిరీస్ విజయంతో పాటు తన ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సపోర్టింగ్ స్టాఫ్‌కు అంకితం ఇస్తున్నట్లు పాండ్యా తెలిపాడు. తమ ఫిట్‌నెస్ కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నాడు. ఇక టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. గిల్ అద్భుతమైన ఆటగాడని, టీమిండియాకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఓపెనర్ దొరికాడని పాండ్యా వెల్లడించాడు. గిల్ తనని తాను మూడు ఫార్మాట్లకు తగ్గట్లుగా మాల్చుకుంటున్నాడని అన్నాడు.
ఇక తన కెప్టెన్సీ గురించి మాట్లాడిన పాండ్యా.. ఎలాంటి ముందస్తు ఆలోచనలు పెట్టుకోకుండా కెప్టెన్సీని చాలా సింపుల్‌గా ఉంచుకోవడానికే ఇష్టపడతానని, ఛాలెంజ్‌తో కూడిన మ్యాచ్‌లుంటే మజా వస్తుందని అన్నాడు. కెప్టెన్సీ విషయంలో తాను ఫాలో అయ్యే సింపుల్ రూల్ ఒకటేనని.. తాను డౌన్‌లో ఉంటే తన కెప్టెన్సీ కూడా డౌన్‌లో ఉంటుందని అన్నాడు. తన ధైర్యాన్ని ఎప్పుడు బ్యాక్ చేసుకుంటూ వచ్చినట్లు తెలిపాడు. ఇక పిచ్ విషయంలో స్పందిస్తూ.. గతేడాది ఐపీఎల్ ఫైనల్ ఆడిన సమయంలో సెంకడ్ బ్యాటింగ్ కష్టమనిపించిందని, పిచ్, వాతావరణం కూడా రెండో బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. బౌలర్లకు సహకరం లభిస్తుంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇలాంటి మంచి ప్రదర్శనను కొనసాగిస్తాం అని అన్నాడు. ఈ సిరీస్‌లో ఏమైన తప్పులు జరిగి ఉంటే.. వచ్చే సిరీస్‌లలో వాటిని సరిదిద్దుకుంటామని కెప్టెన్ పాండ్యా పేర్కొన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రరద్శన, పాండ్యా కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆#TeamIndia | #INDvNZ pic.twitter.com/130FFN6Xhr
— BCCI (@BCCI) February 1, 2023