క్రికెటర్లు అద్భుతంగా ఆడతారు. యాక్టర్స్ కూడా వండర్ ఫుల్ గా నటిస్తారు. తమకు సంబంధించిన ఫీల్డ్ లో చాలా పేరు తెచ్చుకుంటారు. అదే క్రికెటర్లను డ్యాన్స్ చేయమన్నా, నటీనటుల్ని క్రికెట్ ఆడమన్నా సరే చాలా కష్టం. అసలు ఎప్పుడు చేయని పనులు చేయాలంటే ఆ మాత్రం కష్టం ఉంది. ఒకవేళ తమకు తెలియనిది నేర్చుకోవాలంటే మాత్రం తిప్పలు తప్పవు. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. డ్యాన్స్ నేర్చుకోవడానికి తెగ కష్టపడ్డారు. అయినా సరే సరిగా చేయలేకపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషాన్ తదితరులు మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోయారు. ఆ వీడియో కూడా ఫ్యాన్స్ కి తెగ కిక్కిచ్చింది. అయితే ఇప్పుడు మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యకు అతడి భార్య నటాషా స్టెప్పులు నేర్పిస్తూ కనిపించింది. ‘వన్.. టూ.. త్రీ.. ఫోర్’ అని నంబర్స్ చెబుతూ నెమ్మదిగా స్టెప్పులు నేర్పించింది. కానీ హార్దిక మాత్రం ఆమెలా చేయలేకపోయాడు.స్వతహాగా నటి అయిన నటాషా.. చాలా సింపుల్ గా స్టెప్పులు వేసింది. అలవాటు లేని పనికావడంతో హార్దిక్, ఆమెలా చేయలేకపోయాడు. తనకు వచ్చినట్లు చేతులు, కాళ్లు కదిపాడు. ఈ మొత్తం ప్రొసెస్ ని వీడియోగా తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇదికాస్త వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన హార్దిక్ పాండ్య.. కొన్నిరోజుల్లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న అతడు.. గాయాల బారిన పడి కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే సెర్బియన్ నటి నటాషాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో కెప్టెన్ గా కప్ కూడా కొట్టాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగానూ మారాడు. త్వరలో పూర్తిస్థాయి కెప్టెన్ అవుతాడనే టాక్ కూడా వినిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. హార్దిక్-నటాషా డ్యాన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.