టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిక్ దంపతులు మళ్లీ పెళ్లాడనున్నారు. సంప్రదాయ పద్ధతిలో గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకోనున్నారు. కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత వీళ్లు పెళ్లి చేసుకోనుండటం గమనార్హం. హార్దిక్ ప్రేమగాథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిక్ దంపతులు మళ్లీ పెళ్లాడనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హార్దిక్-స్టాంకోవిక్‌లు గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నారని సమాచారం. పాండ్యా రెండో పెళ్లి చేసుకోవడం లేదు. తన భార్య నటాషాను మరోసారి వివాహం చేసుకోనున్నాడు. 2020 లాక్‌డౌన్‌లో వీళ్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం గ్రాండ్‌గా పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని అటుంచితే.. హార్దిక్ దంపతుల ప్రేమగాథ గురించి చాలా మందికి తెలియదు.
కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత వీళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారంటే వింత ప్రేమగాథే మరి. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ మోడల్ అనే విషయం చాలా మందికి తెలియదు. సెర్బియాకు చెందిన నటాషా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ‘సత్యాగ్రహ’, ‘ఫుక్రే రిటర్న్స్’, ‘యాక్షన్ జాక్సన్’, ‘జీరో’ లాంటి ప్రముఖ సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది. ‘ఫ్రైడే’ మూవీలో ‘జిమ్మీ ఛూ’ అనే పాటలో, లుప్త్‌లో ‘భూత్ హు మే’ అనే సాంగ్‌లో స్పెషల్ అప్పీయరెన్స్‌తో అలరించింది. ప్రముఖ సింగర్ బాద్‌షా సరసన చేసిన ‘డీజే వాలే బాబు’ పాట నటాషాకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఇక, బిగ్‌బాస్-8తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిక్‌లు తొలిసారి ముంబైలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఓ పార్టీలో కలిశారు. అక్కడకు అతిథులుగా వచ్చిన వాళ్లిద్దరూ ఒకర్నొకరు పరిచయం చేసుకున్నారు. ఆ రోజు పార్టీలో హార్దిక్ – నటాషా చాలా సేపు ముచ్చటించుకున్నారు. తమ జీవితం, కెరీర్‌లోని విశేషాలను షేర్ చేసుకున్నారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ గడిపిన ఆ క్షణాలు, చెప్పుకున్న కబుర్లు, సరదాగా వేసుకున్న జోకులు, నవ్వుకున్న మూమెంట్స్ కాస్తా తమ మధ్య ఏదో ఉందనే ఊహను వారిద్దరిలోనూ కలుగజేశాయి. ఆ నైట్‌క్లబ్ పార్టీతోనే వారి ప్రేమగాథ మొదలైంది. తాము ఒకర్నొకరు ఇష్టపడుతున్నామని హార్దిక్-నటాషా భావించారు. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేశారు. తక్కువ వ్యవధిలోనే వారి బంధం మరింత బలపడింది.
హార్దిక్ – నటాషా ఒకర్నొకరు విడిచి ఉండలేని పరిస్థితి నెలకొంది. వీళ్లిద్దరూ ఒకరి ఫొటోలను మరొకరు సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేసేవారు. తద్వారా తమ రిలేషన్‌షిప్ గురించి ముందునుంచే ఫ్యాన్స్‌కు హింట్ ఇస్తూ వచ్చారు. అయితే హార్దిక్ – నటాషా బంధం బలపడే కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ఒకవైపు టైట్ క్రికెట్ షెడ్యూల్‌తో పాండ్యా బిజీ అయిపోగా.. మరోవైపు యాక్టింగ్, మోడలింగ్ కెరీర్‌తో నటాషాకు తీరిక ఉండేది కాదు. దీంతో వీళ్లిద్దరూ కలిసేందుకు పెద్దగా చాన్స్ ఉండేది కాదు. అయినా సరే, వీలు చిక్కినప్పుడల్లా హార్దిక్ – నటాషాలు కలుస్తూ ఉండేవారు. ఇద్దరి కెరీర్లలో వైఫల్యాలు వచ్చినప్పుడు ఒకరికి తోడుగా మరొకరు ఉంటూ సపోర్ట్ చేసుకునేవారు. దీంతో వారి రిలేషన్‌షిప్ మరింత స్ట్రాంగ్ అయింది.
నటాషా స్టాంకోవిక్ తన లైఫ్ పార్ట్‌నర్ అని ఫిక్స్ అయిన హార్దిక్ పాండ్యా.. 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో ఆమె చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆమె కూడా పాండ్యా లవ్‌ను యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, మిత్రులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2020 లాక్‌డౌన్‌లో తన భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో హార్దిక్ పెట్టినప్పుడే అతడికి పెళ్లయిందని అందరికీ తెలిసింది. అదే ఏడాది జులైలో పండంటి మగబిడ్డకు నటాషా జన్మనిచ్చింది. ఆ బాబుకు అగస్త్య పాండ్యా అనే పేరు పెట్టారు. ఇప్పుడు మరోసారి ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నారు. మరి, హార్దిక్-నటాషా ప్రేమగాథ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.