ఆసియాకప్ లో భారత జట్టు ఓడిపోయింది. సూపర్ 4లో పాక్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాయాది దేశంతో మ్యాచ్ అంటే.. ఇరుదేశాల అభిమానుల్లో ఎనలేని ఆసక్తి. ఎప్పుడూ కూడా మన జట్టే గెలవాలని గట్టిగా కోరుకుంటారు. ఇక నిన్న పాక్ గెలిచేసరికి కోపం తట్టుకోలేకపోయారు. సరైన సమయంలో ఓ ముఖ్యమైన క్యాచ్ వదిలేసిన బౌలర్ అర్షదీప్ సింగ్ ని టార్గెట్ చేశారు. అతడిపై ఏకంగా జాత్యాంహకార దూషణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అర్షదీప్ కి అండగా నిలిచాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాతో సూపర్ 4 మ్యాచులో చివరి 18 బంతుల్లో పాక్ విజయానికి 34 పరుగులు కావాలి. ఆ సమయంలో రవి బిష్ణోయ్ బౌలింగ్ చేశాడు. రెండు వైడ్లు వేసి క్రీజులో ఉన్న ఆసిఫ్ అలీ కాస్త లయ దెబ్బతీసేలా చేశాడు. మూడో బంతికి అలీ హిట్టింగ్ చేయాలని చూడగా బంతి గాల్లోకి లేచింది. ఇక గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ సునాయసంగా క్యాచ్ అందుకోవాల్సింది. కానీ బంతి చేతుల్లో పడి నేలపాలయింది. అంతే ఒక్కసారిగా గ్రౌండ్లో భారత అభిమానులంత సైలెన్స్ అయిపోయారు. రోహిత్ శర్మకు కోపం కట్టలు తెంచుకుంది.. అర్షదీప్ సింగ్‌పై ఓ రేంజులో అరిచాడు. ఆ తర్వాత భారత్ మ్యాచ్ ఓడిపోవడంతో నెటిజన్స్ అంతా అర్షదీప్ ని టార్గెట్ చేశారు.
ఇక అర్షదీప్ సింగ్ సిక్కు మతానికి చెందిన వాడు. ఈ క్రమంలోనే అతని మతాన్ని ఉద్దేశించి కొందరు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు అతను ఖలీస్థానీ అని దెప్పిపొడిచారు. ఇక కొందరైతే కావాలనే అర్షదీప్ క్యాచ్ జారవిడిచాడని.. కావాలనుకుంటే రిప్లేలో చూసుకోండని పోస్టులు పెడుతున్నారు. ఈ కామెంట్స్ పై సీరియస్ అయిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. ‘మన కుర్రాడు అర్షదీప్ ని విమర్శించడం ఆపండి. ఎవరూ కావాలని క్యాచ్ వదిలేయరు. ఏదేమైనా మన భారత కుర్రాళ్లని చూసి గర్విస్తున్నాం.. పాకిస్థాన్ మెరుగ్గా ఆడింది. అర్షదీప్ పై కామెంట్స్ చేస్తున్న వారికి సిగ్గుండాలి’ అని ఫైర్ అయ్యాడు.
ఇదిలా ఉండగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్, కేఎల్ రాహుల్ తలో 28 పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో పాక్ జట్టు.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విజయాన్ని అందుకుంది. మరి అర్షదీప్ క్యాచ్ వదిలేయడం, నెటిజన్స్ కామెంట్స్ చేయడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: టీమిండియాతో మ్యాచ్ అంటే మాకు భయం లేదు: పాక్ క్రికెటర్ రిజ్వాన్