Harbhajan Singh: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సౌరవ్ గంగూలీ స్థానం ప్రత్యేకం. ఆటగాడిగా మాత్రమే కాకుండా, టీమిండియా కెప్టెన్ గా కూడా గంగూలీ ప్రస్థానం అనన్య సామాన్యమైంది. ఈరోజు ఇండియన్ క్రికెట్ టీమ్ ఇంత బలంగా ఉంది అంటే.. దానికి బాటలు వేసింది గంగూలీ అనే చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఇండియన్ క్రికెట్ ని కుదిపేశాయి. కెప్టెన్సీ అనే ముళ్ళ కిరీటాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. సరిగ్గా అలాంటి సమయంలో దాదా ముందుకి వచ్చాడు. వచ్చి రాగానే టీమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేసి, టీమ్ లోకి యువకులను తీసుకొచ్చాడు. టీమిండియాకి దూకుడు మంత్రాన్ని నేర్పించాడు. విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ లు గెలవడం నేర్పించాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి జట్ల ఆధిపత్యానికి గండి కొట్టాడు.
ఈ క్రమంలోనే సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్, కైఫ్, జహీర్ ఖాన్, ధోని లాంటి ఆటగాళ్లకు కావాల్సినంత భరోసా ఇచ్చి, వారు స్టార్స్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత చేశాడు కాబట్టే.. ఆ క్రికెట్ర్స్ అంతా ఈరోజుకి దాదాకి విపరీతమైన గౌరం ఇస్తారు. ఇలా దాదా బాయ్స్ గా ముద్ర పడిన వారిలో హర్భజన్ కూడా ఉన్నాడు. అయితే.. తాజాగా హర్భజన్ ఓ ఇంటర్వ్యూలో గంగూలీపై సీరియస్ కామెంట్స్ చేశాడు. “ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో గంగూలీ నాకు అవకాశం ఇవ్వకుండా ఉండి ఉంటే.. అతడు తన కెప్టెన్సీని కోల్పోయి ఉండేవాడు. ఆ సిరీస్ లో ఆసీస్ బ్యాట్సమెన్ నా బౌలింగ్ ఎదుర్కోలేక విలవిలలాడిపోయారు. ఇక కలకత్తా టెస్ట్ విజయంతో గంగూలీ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తరువాత కెప్టెన్సీ విషయంలో ప్రయోగాలకు తావు లేకుండా పోయింది. సుదీర్ఘ కాలం దాదా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కొనసాగాడు.
ఇది నా టాలెంట్ వల్లే సాధ్యం అయ్యింది” అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. అయితే.., కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చి తనకి ఇంత స్థాయి రావడానికి కారణమైన గంగూలీపై బజ్జీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలవడానికి వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్ ల సూపర్ బ్యాటింగ్ కూడా కారణం. అన్నిటికీ మించి టీమ్ లో ఆ ధైర్యాన్ని నింపిన గంగూలీ కెప్టెన్సీ కారణం. హర్భజన్ ఇవన్నీ వదిలేసి అంతా తనవల్లే జరిగింది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హర్భజన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ben Stokes: మళ్ళీ అదే బెన్ స్టోక్స్.. ఇది మామూలు అదృష్టం కాదు!
Mumbai ➤ 🇦🇺 win by 10 wickets
Kolkata ➤ 🇮🇳 win by 171 runs
Chennai ➤ 🇮🇳 win by two wickets#OnThisDay in 2001, India completed a dramatic turnaround against Australia, coming from 0-1 down to clinch the series 2-1 👏Harbhajan Singh picked up 15 wickets in the Test 🤯 pic.twitter.com/z0OzZOpshM
— ICC (@ICC) March 22, 2020