హర్భజన్ సింగ్ అనగానే టీమిండియా స్పిన్నర్ గుర్తొస్తాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థుల్ని ముప్పతిప్పలు పెట్టిన భజ్జీ.. ఐపీఎల్ లో అదరగొట్టే ప్రదర్శనలు ఎన్నో చేశాడు. ఈ లీగ్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మంచి మంచి ఇన్నింగ్సులు ఆడి ఆకట్టుకున్నాడు. అలా తన క్రికెట్ కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన హర్భజన్ సింగ్.. అక్కడ కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అలానే మోసగాళ్ల బారి నుంచి ఓ యువతిని కాపాడి శెభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కి చెందిన సికిందర్ సింగ్ ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయే కమల్జీత్. 21 ఏళ్ల వయసు. తండ్రి సంపాదన అంతంత మాత్రం కావడంతో.. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనుకుంది. దీంతో స్థానిక ఏజెంట్ జసీర్ ని కలిసి, విదేశాల్లో తనకు ఏదైనా పని ఉంటే చెప్పమని కోరింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న సదరు ఏజెంట్.. మోసపూరితంగా ఆమెని ఒమన్ పంపించే ఏర్పాటు చేశాడు. హిందూ ఫ్యామిలీకి వంట చేసి పెట్టాలని.. మంచి జీతం,వసతి ఉంటాయని నమ్మబలికాడు. అక్కడ బాగా పనిచేస్తే కెనడా, ఆస్ట్రేలియా పంపించే ఏర్పాట్లు చేస్తానని ఏజెంట్ చెప్పాడు.
తీరా ఒమన్ వెళ్లిన కమల్జీత్ కి వింత అనుభవం ఎదురైంది. తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి.. పాస్ పోర్ట్, సిమ్ కార్డ్ లాగేసుకున్నాడు. రూమ్ లో బంధించేసి.. బుర్భా ధరించాలని, అరబిక్ నేర్చుకోవాలని బలవంతం చేశాడు. అక్కడ నుంచి ఎలాగో ఒకలా తప్పించుకున్న ఆమె.. కొత్త సిమ్ తీసుకుని తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఏజెంట్ వద్దకు వెళ్లిన సికిందర్.. తన కుమార్తెని తిరిగి తీసుకొచ్చే ఏర్పాటు చేయమన్నాడు. కానీ అతడు రూ 2.5 లక్షలు డిమాండ్ చేశాడు. చేసేదేం లేక ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బు ఇచ్చాడు.
మరోవైపు తన కూతురు గురించి బంధువైన ఆప్ నేతకు చెప్పాడు. తద్వారా ఈ విషయాన్ని పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన హర్భజన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై భజ్జీ తక్షణమే స్పందించడమే కాదు ఆ దేశంలోని మన ఎంబసీ అధికారులతో మాట్లాడారు. దీంతో వాళ్లు కమల్జీత్ ని స్వదేశానికి తిరిగొచ్చేలా చేశారు. ఈ మధ్య ఆమె పంజాబ్ చేరుకుంది. తాను ఇంటికి తిరిగొస్తానని అనుకోలేదని చెప్పిన కమల్జీత్ హర్భజన్ తో పాటు ఎంబసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని భజ్జీ సూచించాడు. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆరోజు శ్రీశాంత్ ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను: హర్భజన్ సింగ్
To help an Indian citizen held captive in foreign land was my duty not only as MP but as a fellow Indian citizen. I thank GOI & @Indemb_Muscat for the assistance & cooperation in bringing Kamaljeet back to India. I feel blessed that I could associate myself in this noble mission https://t.co/9eHwNVk0MY
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 7, 2022