సౌరవ్ గంగూలీ ఆటగాడిగా, కెప్టెన్‌గా.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. దాంతో పాటు ఎంతో మంది క్రికెటర్లకు అండగా నిలబడ్డాడు. అందుకే వారికి కూడా గంగూలీ అంటే చెప్పలేనంత ఇష్టం.. అలాంటి వారిలో హర్భజన్ సింగ్ ఒకడు.
ఇండియన్ క్రికెట్ తలరాతను మార్చిన కెప్టెన్ ఎవరంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా. భారత్ కోసం వరల్డ్ కప్ గెలవలేకపోయినా.. అలా గెలిచే జట్టును తయారు చేసింది మాత్రం దాదానే. అందుకే.. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్లలో ఒకడిగా గంగూలీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత జట్టు ఫిక్సింగ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన దాదా.. ఎన్నో సవాళ్ల మధ్య జట్టును ముందుకు నడిపించాడు. కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే.. జట్టును ప్రక్షాళన చేసి, సీనియర్లు, జూనియర్లతో జట్టును సమతూకం చేశాడు. మట్టిలోని మాణిక్యాలను వెతికి మరీ తీసుకొచ్చి జట్టులో చోటిచ్చాడు. చాలా మంది సాధారణ క్రికెటర్లను సైతం స్టార్లుగా మార్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది.
పసికూన లాంటి జట్టుతో అద్భుతాలు సృష్టించాడు. స్వదేశంలో పులి, విదేశాల్లో పల్లి అనే ముద్రను భారత జట్టు నుదిటిపైనుంచి తుడిచేశాడు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న ఆస్ట్రేలియాను ఓడించి.. వారి గర్వాన్ని అణిచి, టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచి పోషించాడు. దాదా లేకుంటే.. టీమిండియా ఇంకా భయంభయంగానే క్రికెట్ ఆడేదని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. ఎదురుగా ఎలాంటి జట్టు ఉన్నా.. భయం లేకుండా ఆడటం టీమిండియాకు దాదానే నేర్పించాడు. అలాగే జట్టులోని ఆటగాళ్ల కోసం బీసీసీఐతో సైతం పోరాటం చేసిన ఏకైక కెప్టెన్ గంగూలీనే. అందుకే చాలా మంది గొప్ప క్రికెటర్లకు గంగూలీ అంటే మాటల్లో చెప్పలేని ఇష్టం, ఎన్నేళ్లు గడిచినా అదే గౌరవం. వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, ధోని ఇలాంటి గొప్ప గొప్ప క్రికెటర్లందరికి లైఫ్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ఇబ్బంది పడుతుంటే అండగా నిలబడింది దాదానే.
వారందరూ అనేక సంబర్భాల్లో దాదాపై తమకున్న ప్రేమ, గౌరవాన్ని వెల్లడించారు. అలాగే హర్భజన్ సింగ్ సైతం ఒకనొక సందర్భంలో గంగూలీ గురించి ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాదా గురించి భజ్జీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందుకు కారణం.. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ ఇష్యూ. మంగళవారం రాత్రి చేతన్ శర్మపై ప్రముఖ న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ జరిపిన విషయం తెలిసిందే. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో గంగూలీకి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉండేది కాదని, ఆ కారణంతోనే రోహిత్ శర్మను కెప్టెన్ చేశాడంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కోహ్లీ కెప్టెన్సీ విషయంతో దాదాను విలన్‌గా చూపించే ప్రయత్నిం జరిగింది.
ఈ క్రమంలో గతంలో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ఆ వీడియోలో భజ్జీ మాట్లాడుతూ..‘నా కష్ట కాలంలో ఎవరైన అండగా నిలిచారంటే అది సౌరవ్ గంగూలీనే. నాతో ఎవరు ఉన్నా లేకున్నా, గంగూలీకి కోసం ఎవరు నిలబడినా, నిలబడకపోయినా.. నేను చచ్చే వరకు దాదా కోసం నిలబడతా, నా పెద్ద అన్న లేడు. ఒక వేళ ఉన్నా కూడా దాదా చేసినంత నా కోసం చేసే వాడు కాదేమో. థ్యాంక్యూ దాదా!’ అంటూ హర్భజన్ భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం చేతన్ శర్మ ఇష్యూలో దాదాకు మద్దతుగా ఎవరూ లేకపోయినా.. తామున్నామంటూ గంగూలీ ఫ్యాన్ష్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Selfless achievement has a bigger satisfaction than self achievement.🙏
Love You Dada ❤️
Proud to be your Fan 🙏@SGanguly99 @harbhajan_singh#SouravGanguly #Ganguly#IamGangulian pic.twitter.com/wb8CD6nGry— Pambi Praveen Kumar (@PraveenPKBRS) February 16, 2023