మహేంద్ర సింగ్ ధోని అంటే ప్రశాంతతకు చిరునామా. కానీ ఒకసారి ధోని కోపంతో బ్యాట్ విరగొట్టాడని భారత మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. మరి ధోని ఎందుకు అలా చేసాడు ? ఆ మాజీ స్పిన్నర్ ఎవరు ?
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ఎంత కూల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు తప్ప కోపం మనం చూడం. అందుకే అభిమానులు ధోనిని మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించకుండా .. ఎలాంటి ఎమోషన్స్ కి లోనవ్వకుండా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. కాంప్లిమెంట్లకి దగ్గరగా కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ధోని మీద ఎవ్వరూ విమర్శలు చేయడానికి సాహసించరు. అయితే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ధోని గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు.
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో ఆఫ్ స్పిన్నర్ గా చాలా సంవత్సరాలు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడూ కూడా ఎవ్వరిని విమర్శించని హర్భజన్ తాజాగా మహేంద్ర సింగ్ ధోని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ధోనికి కూడా కోపం వస్తుందని చెప్పుకొచ్చాడు. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. “మిస్టర్ కూల్ గా ధోనికి రెండుసార్లు కోపం రావడం చూసాను. ఝార్ఖండ్ లో ఒకసారి రెండు టీమ్స్ గా విడిపోయి వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు ధోని జట్టు వెనకబడి ఉంది. ఈ సమయంలో మహీ కోపంతో ఊగిపోయాడు. బ్యాట్ నేలకేసి కొడితే విరిగిపోయింది. ఐపీఎల్ లో కూడా అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో గ్రౌండ్ బయట ఉన్న ధోని కోపంతో గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్ తో గొడవాడాడు. ఏ రెండు సందర్భాలలో మాత్రమే ధోనిలో నేను కోపం చూసాను”. అని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న ధోని వరుస విజయాలతో చెన్నై జట్టుని టాప్ లో నిలిపాడు. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ఇటీవలే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ధోని ఎక్కడికి వెళ్తే అక్కడ వాలిపోతున్నారు. ధోని నామం జపిస్తూ ఫ్లాష్ లైట్ లతో సందడి చేస్తున్నారు. జట్టులో ప్లేయర్లు కూడా అదరగొట్టేస్తున్నారు. మరి అందరు భావిస్తున్నట్టు ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా ? లేకపోతే మరికొన్నేళ్లు టీమ్ లోనే ఉంటాడా ?తెలియాల్సి ఉంది. మొత్తానికి కూల్ గా ఉండే ధోని తన కెరీర్ మొత్తంలో ఇలా రెండు సార్లు మాత్రమే కోప్పడడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.