హర్బజన్ సింగ్.. గొప్ప ఆఫ్ స్పిన్నర్, అగ్రెసివ్ క్రికెటర్, టీమిండియాకు తన మ్యాజిక్ బౌలింగ్‌తో ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడు. ఇటివల అంతర్జాతీయంగా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ గురించి, తాను ఈ స్థాయికి రావడం గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అందులో ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి చెప్పాడు.
దాదా తనను వెన్నుతట్టి ప్రొత్సహించినట్లు పేర్కొన్నాడు. తన టాలెంట్‌ను దాదా గుర్తించాడని అతని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. జట్టు ఎంపిక విషయంలో గంగూలీ ఆ రోజు సెలెక్టర్ వద్ద తన కోసం పట్టుపట్టకపోయింటే నేను ఒక అనామక ఆటగాడిగానే మిగిలిపోయేవాడని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ధోని సారథ్యం కూడా మంచి ప్రదర్శన కనబర్చిన హర్భజన్.. ధోని కూడా మంచి కెప్టెన్ అని కితాబిచ్చాడు.
మనల్ని సరైన దిశలో నడిపించే వ్యక్తి మాత్రం ఒక్కరే ఉంటారని నా జీవితంలో ఆ వ్యక్తి దాదానే అని అన్నాడు. ఇలా తన కెప్టెన్ గంగూలీతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. 1998లో మహమ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన భజ్జీ.. 2001లో దాదా కెప్టెన్‌గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టి తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. మరి హర్భజన్ కెరీర్‌పై, దాదా తనకిచ్చిన సపోర్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడం కరెక్టేనా? రికార్డులు చూస్కోండి.. దాదా, ధోని కంటే బెటర్