ఆంధ్ర క్రికెటర్ విహారీకి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తుంది. టీంఇండియాలో వరుస అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీని ప్రకారం ఆంధ్ర జట్టుని వీడి మధ్య ప్రదేశ్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడబోతున్నాడని తెలుస్తుంది.
టాలెంట్ ఉన్నా అవకాశం రాని ప్లేయర్లు క్రికెట్ లో ఇప్పటికీ ఉన్నారు. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కొంతమంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు టీమిండియాలోకి రాలేకపోతున్నారు. ఈ లిస్టులో తెలుగు తేజం హనుమ విహారి కూడా ఉంటాడు. టెస్టు క్రికెట్ లో డెబ్యూ చేసినా విహారీకి వరుస అవకాశాలు రావడం లేదు. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు ఈ తెలుగు కుర్రాడు పర్వాలేదనిపించే ప్రదర్శన చేసాడు. ఏడాది క్రితం వరకు 15 మందిలో ప్రాబబుల్స్ లో విహారీకి ఖచ్చితంగా స్థానం లభించేది. కానీ ఇప్పుడు ఈ యువ ఆటగాడిని టీమిండియా సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేసారు. దీంతో ఇప్పుడు విహారీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అదే జరిగితే మన తెలుగు తేజం మధ్య ప్రదేశ్ టీంకి ఆడనున్నాడు.
ఆంధ్ర క్రికెటర్ విహారీకి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తుంది. ఇప్పటివరకు టీమిండియా తరపున 16 టెస్టులు ఆడి 33.56 సగటుతో 839 పరుగులు చేసాడు. కెరీర్ పరంగా చూసుకుంటే 2021 లో ఆడిన సిడ్నీ టెస్ట్ విహారీకి ప్రత్యేక గుర్త్తింపు తీసుకొచ్చింది. గాయంతో జట్టుకి దూరమైనా.. ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అర్ధ సెంచరీ చేయకపోయినా ఈ మ్యాచులో అశ్విన్‌తో కలిసి గాయాలను తట్టుకొని మరీ 36 ఓవర్లకు పైగా వికెట్లకు అడ్డుగా నిలబడిపోవడంతో ఏ మ్యాచ్ ని టీమిండియాని డ్రా చేసుకోగలిగింది. అయితే గత కొంతకాలంగా విహారీకి అస్సలు కలిసి రావడం లేదు. దీంతో ఈ ఏడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల లిస్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో విహారి ఆంధ్రా టీమ్ నుంచి బయటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. పూర్తి వివరాళ్లోకేతే..
ప్రస్తుతం విహారీ దులీప్ ట్రోఫీ 2023 టోర్నీలో సౌత్ జోన్ టీమ్‌కి కెప్టెన్సీ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే సీజన్‌లో మధ్య ప్రదేశ్ టీమ్ తరుపున దేశవాళీ టోర్నీలు ఆడబోతున్నట్లుగా సమాచారం. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పటికే ఎన్‌ఓసీ కూడా తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్ కోచ్ గా ఉంటున్న చంద్రకాంత్ పండిత్ దగ్గర శిక్షణ తీసుకోవాలని భావిస్తున్నాడట. విహారి తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి కారణం ఏమిటని పరిశీలిస్తే.. ఆంధ్రాలో సరైన కోచింగ్ లేకపోవడమే అని తెలుస్తుంది. ఈ కారణంగానే విహారీ వరుస అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడని విహారీ ఫీల్ అయినట్టుగా సమాచారం. మరి త్వరలోనే విహారీ ఆంధ్ర క్రికెట్ ని వీడి వెళ్తాడా అనే విషయం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.