ప్రస్తుతం సౌత్ జోన్ కి కెప్టెన్సీ చేస్తున్న విహారీ టీం ఫైనల్ కి దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్ తో తుది పోరుకి సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విహారీ ఆసక్తికర కామెంట్లు చేసాడు.
భారత టెస్టు టీంలో చోటు దక్కించుకున్న అతి కొద్దిమంది క్రికేటర్లలో హనుమ విహారి కూడా ఒకరు. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో విహారి భారత్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక అప్పటినుంచి ఈ తెలుగు కుర్రాడి వైపు సెలక్టర్లు కరుణ చూపించడం లేదు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులోకి రావడానికి అది సరిపోవడం లేదు. దీంతో టెస్టు సిరీస్ విహారీ టీమిండియాకు దూరమయ్యాడు. అంతేకాదు ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతన్ని తొలగించారు. దీంతో ఇక విహారీ పని అయిపోయిందని.. జట్టులో స్థానం దక్కించుకుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విహారీ తనకు జట్టులో స్థానం దక్కకపోవడంపై స్పందించాడు.
విహారీ టెస్టు కెరీర్ గమనిస్తే పర్వాలేదనిపించేలా ఉన్నా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈ తెలుగు కుర్రాడు ఎక్కువగా విదేశాల్లో ఆడాడనే సంగతి గుర్తుంచుకుకోవాలి. ఒకవేళ స్వదేశంలో ఎక్కువగా టెస్టు మ్యాచులు ఆడి ఉంటే విహారీ యావరేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారత బ్యాటర్లు అందరూ స్వదేశంలో పులిలా ఆడినా విదేశాల్లో మాత్రం తేలిపోతారు. కానీ విహారీ మాత్రం తన వంతు పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టు డ్రా అవ్వడంతో కీలక పాత్ర పోషించాడు. అయినా విహారీ మీద సెలక్టర్లు నమ్మకం ఉంచడం లేదు. ప్రస్తుతం విండీస్ సిరీస్ కి సిద్ధమవుతున్న టీమిండియా జట్టులో విహారీ చోటు దక్కపోవడంపై సెలక్టర్లపై అసహనం వ్యక్తం చేసాడు.
ప్రస్తుతం సౌత్ జోన్ కి కెప్టెన్సీ చేస్తున్న విహారీ టీం ఫైనల్ కి దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్ తో తుది పోరుకి సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విహారీ ఆసక్తికర కామెంట్లు చేసాడు. “జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో తెలియడం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను. బహుశా సెలక్టర్లకు అది సరిపోవడం లేదేమో. అయితే ఈ విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. కానీ నేను నెమ్మదిగా ఆడతాననే దురభిప్రాయం చాలా మందికి ఉంది. టెస్టు క్రికెట్ చాలా భిన్నమైనది. పరిస్థితులకి తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. దులీప్ ట్రోఫిలో ధాటిగా ఆడాల్సిన సమయంలో విహారీ 42 బంతుల్లో 43 పరుగులు చేసాను”. అని విహారీ తెలియజేశాడు. మరి ఈ తెలుగు ప్లేయర్ సెలక్టర్లపై అసహనం చూపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.