మన ఇండియాలో క్రికెట్‌కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ వీక్షించడం కోసం ఎంత దూరమైన వెళ్తారు అభిమానులు. ఇక టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో టీ20 టికెట్లు అమ్మకం నిర్వహించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు దక్కించుకోవడానికి వేల సంఖ్యలో పరిమితికి మించి జనాలు రావడం.. వారంతా ఒక్కసారిగా టికెట్ కౌంటర్ వైపు దూసుకెళ్లడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు తొక్కిసలాట ఘటనలో హెచ్‌సీఏ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పారు. వారి నిర్లక్ష్యంగా కారణంగానే తోపులాట చోటు చేసుకుందని వెల్లడించడమే కాక.. కేసు కూడా నమోదు చేశారు.
ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్ధీన్‌తో పాటు.. దాని నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన యువతి అదితి ఆలియా, ఎస్సై ప్రమోద్ ఫిర్యాదుతో హైదరాబాద్ యాక్ట్‌తో పాటు 420, 21, 22/76 పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల అమ్మకం వేళ నిర్లక్ష్యంతో పాటు.. వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలపై కూడా పలు ఫిర్యాదులు అందినట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అంతేకాక తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమే అని బేగంపేట పోలీసులు స్పంష్టం చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.